చిత్రమాలిక : ఈ ఫొటోలు చూస్తే ప్లాస్టిక్ అంటే భయమేస్తుంది!!

నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్.. జూన్ సంచికలో ఆసక్తికరమైన ఫోటోలను ప్రచురించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రపంచాన్ని ఎలా పొట్లం కట్టేస్తున్నాయో వీటిని చూస్తే అర్థమవుతుంది.

ఫొటో క్యాప్షన్,

సాధారణంగా సముద్ర గుర్రం.. తరంగాలను ఈదడానికి ఏ గడ్డిపీచునో, ఏ చెత్తనో సాధనంగా తీసుకుంటుంది. కానీ ఇండొనేషియా దీవుల్లోని ఈ సముద్ర గుర్రం మాత్రం, ‘ప్లాస్టిక్ ఇయర్ బడ్’ సాయంతో ఈదుతోంది. ‘‘ఈ ఫోటోలో కనిపించే దృశ్యం భవిష్యత్తులో కనిపించకూడదని కోరుకుంటున్నా’’ అని ఫోటోగ్రాఫర్ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

స్పెయిన్ సముద్రంలోని ఈ తాబేలు.. పారవేసిన ఓ ‘ప్లాస్టిక్’ చేపల వలలో చిక్కుకుంది. ఊపిరాడక సతమతమవుతోన్న ఈ తాబేలును ఫోటోగ్రాఫర్ చూసుండకపోతే, ఈపాటికి అది మరణించి ఉండేది!

ఫొటో క్యాప్షన్,

ఈ కొంగను చూడండి.. ప్లాస్టిక్ గౌను తొడిగినట్లుంది కదూ.. కానీ జరిగింది వేరు. స్పెయిన్‌లోని ఈ కొంగకు గాలికి ఎగిరొచ్చిన ఓ ప్లాస్టిక్ కవర్ తగులుకుంది. సమయానికి ఈ ఫోటోగ్రాఫరే దీన్ని రక్షించాడు.

ఫొటో క్యాప్షన్,

జపాన్‌ ఒకినవా లోని ఈ పీత.. ఓ ప్లాస్టిక్ బాటిల్ మూతలో దాక్కుంది.

ఫొటో క్యాప్షన్,

ప్లాస్టిక్ సమస్య గురించి ఈ సంచిక కట్టుబడి ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం వెలుపల ఎంత శాతం ఉన్నాయో.. సముద్ర గర్భంలో ఏమేరకు ఉన్నాయో ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలు.. కళ్లకు కనిపించనంత చిన్నవిగా ఉండి సముద్ర జీవులను ప్రమాదం అంచులకు తోస్తున్నాయి.

ఫొటో క్యాప్షన్,

ఢాకా నగరంలోని నదీ తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను (కవర్లు/షీట్స్) కడిగి, వాటిని ఈ మహిళ ఆరబెడుతోంది. నిత్యమూ ఈమె ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో పని చేస్తుంది. చివరికి తన కొడుకు ఆలనా పాలన కూడా ఈ ప్లాస్టిక్ గుట్టల్లోనే! ఈ వ్యర్థాలను ఓ ప్లాస్టిక్ రీసైక్లర్‌కు అమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లాస్టిక్‌లో 5వ వంతు ప్లాస్టిక్‌ను తిరిగి ఉపయోగిస్తున్నారు. అమెరికాలో 10% కంటే తక్కువ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేస్తున్నారు.

ఫొటో క్యాప్షన్,

ఇథియోపియా లోని హరార్‌ చెత్తకుప్పలపై హైనాలు. అడవుల్లో ఉండాల్సిన హైనాలు చెత్తకుప్పల్లో తిరుగుతున్నాయి. తరచూ ఇక్కడకొచ్చే చెత్త లారీల శబ్దం విని పరిగెత్తుకుంటూ ఇక్కడికొస్తాయి. ఈ ప్లాస్టిక్ చెత్తకుప్పల్లోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి.

ఫొటో క్యాప్షన్,

సెంట్రల్ మాడ్రిడ్‌లోని సిబెల్స్ ఫౌంటైన్‌ను ప్లాస్టిక్ బాటిళ్లు కప్పేశాయి. ప్రపంచంలో ప్లాస్టిక్ ప్రభావం ఏమేరకు ఉందో తెలియచెప్పడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి మరో రెండు ఫౌంటైన్లలో 60 వేల ప్లాస్టిక్ బాటిళ్లను నింపేశారు.