చీర్‌లీడర్స్‌: ‘మమ్మల్ని కేవలం అందమైన ఆట బొమ్మల్లా చూస్తారు’

  • 27 మే 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచీర్‌లీడర్స్ చిరునవ్వుల వెనకున్న అసలు కథ

ఐపీఎల్ పేరు వినగానే బుల్లెట్లలా దూసుకెళ్లే బంతులే కాదు, మెరుపులా మెరిసే చీర్ లీడర్స్ కూడా గుర్తుకొస్తారు. వీళ్లు లేని ఐపీఎల్ మ్యాచ్‌లను ఊహించడమే కష్టం.

అయితే, ప్రేక్షకులకు వాళ్ల అందమే కనిపిస్తుంది. కానీ, దాని వెనుక ఎంతో కఠినమైన శ్రమ ఉంటుందన్న వాస్తవం మాత్రం తెలియదు.

ఏటా ఐపీల్ మ్యాచ్‌ల కోసం దాదాపు 60 మంది విదేశాలకు చెందిన చీర్‌ లీడర్స్‌ని ఎంపిక చేస్తారు. ఈ సారి మొత్తం ఎనిమిది బృందాల్లో, 6 బృందాలు విదేశాల నుంచి వచ్చినవే.

అయితే, సాధారణంగా చీర్‌లీడర్స్‌లో రష్యా యువతులే ఎక్కువగా ఉంటారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాలకు చెందిన వాళ్లు కూడా ఐపీఎల్ కోసం వచ్చారు.

తమ చిరునవ్వుల వెనకున్న ఎంత కఠినమైన శ్రమ ఉంటుందో.. తెరవెనుక తమ జీవితాలు ఎలా ఉంటాయో వాళ్లు బీబీసీతో పంచుకున్నారు.

"నేను చీర్ లీడర్‌ని మాత్రమే కాదు.. డ్యాన్సర్‌ను కూడా. యూరప్ అంతటా ప్రదర్శనలు ఇస్తుంటాను. ఇటీవలే మెక్సికోలో ఆరు నెలలు ఉన్నాను" అని ఆస్ట్రేలియాకు చెందిన క్యాథరిన్ వివరించారు.

"క్రీడాకారుల మాదిరిగానే మేమూ ఎంతో తీవ్రంగా శ్రమించాలి. ఒక సారి నాకు పక్కటెముక కూడా విరిగింది. కానీ చూసే వారికి మేం పడే కష్టాలు, ఇబ్బందులు ఏమీ కనపడవు. అసలైన ఆట ఇదే" అని తమ వృత్తిలో ఉన్న కష్టాల గురించి చెప్పారు బ్రిటన్‌ నుంచి వచ్చిన డేన్ బేట్‌మన్.

"క్రికెటర్ల మాదిరే మేం కూడా క్రీడాకారులమే. కానీ చాలా మంది దీన్ని గుర్తించరు. మమ్మల్ని కేవలం అందమైన ఆట బొమ్మల్లా చూస్తారు. ఇలా నవ్వులు రువ్వుతూ డ్యాన్స్ చేయడానికి కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది" అని ఐర్లాండ్‌ నుంచి వచ్చిన డారా కీవినీ వివరించారు.

"చీర్‌లీడర్స్‌ పనిని ఒక వృత్తిగానే చూస్తాం. మా అందాలను ప్రదర్శించడానికి ఇక్కడకు రాలేదు. డ్యాన్స్ చేయడం మా వృత్తి. ఈ పని చేస్తున్నది కేవలం ప్రేక్షకుల కోసం మాత్రమే కాదు, మా అవసరం కూడా" అని అంటారు బ్రిటన్‌కు చెందిన డేన్ బ్యాట్‌మ్యాన్.

"అందరూ అనుకుంటున్నట్లుగా మా జీతాలు బ్రహ్మాండంగా ఏమీ ఉండవు. మా శ్రమతో పోలిస్తే మాకిచ్చేది చాలా తక్కువే" అని అంటారు ఎల్లె అనే మరో చీర్‌లీడర్.

"భారతీయ వంటకాల్లో నాకు సమోసా అంటే చాలా ఇష్టం. హిందీలో ధన్యవాదాలు ఎలా చెప్పాలో మాత్రమే నేర్చుకున్నాను" అని చెప్పారు ఐర్లాండ్ నుంచి వచ్చిన డారా కినివీ.

నిజానికి చీర్ లీడర్స్‌ అనే పద్ధతి పురుషులతోనే ప్రారంభమైంది.

అమెరికాలోని మిన్నెసొటా యూనివర్సిటీకి చెందిన జాన్ క్యాంప్‌బెల్.. 1898లో తొలి చీర్ లీడర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందరూ పురుషులే ఉండే ఆ బృందాన్ని 'యెల్ స్క్వాడ్' అని పిలిచేవారు.

రానురాను మహిళలు కూడా వృత్తిలో చేరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పింజ్రా తోడ్: ‘దేశ వ్యతిరేక కార్యకలాపాల’ ఆరోపణలతో యువతుల అరెస్ట్ - బెయిల్ - వెంటనే మళ్లీ అరెస్ట్

లాక్‌డౌన్ ‌సమయంలో టెక్ ఇండస్ట్రీ విజేతలు ఎవరు? పరాజితులు ఎవరు?

''ఆస్తుల విక్రయం ప్రతిపాదనను పున:పరిశీలించండి.. అప్పటివరకూ అమ్మకాలు ఆపేయండి'' - టీటీడీకి ఏపీ ప్రభుత్వం ఆదేశం

వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’

''ఇక్కడ భూమి బాగానే కంపిస్తోంది...'': భూకంపంలోనూ ఇంటర్వ్యూ ఆపని న్యూజిలాండ్ ప్రధాని

భారత్ - పాక్ సరిహద్దులో స్థానికులు పట్టుకున్న ఈ పావురం పొరుగు దేశపు గూఢచారా?

హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ సీనియర్: 3 ఒలింపిక్స్‌‌లలో 3 స్వర్ణ పతకాలు అందించిన ఆటగాడు

కరోనావైరస్ సెకండ్ వేవ్: ఆసియా దేశాల నుంచి ప్రపంచ దేశాలు ఏం నేర్చుకోవాలి

వీడియో: కరోనావైరస్‌పై పోరాటానికి సహకరిస్తున్న నాలుగు కాళ్ల హీరో