‘కోకకోలా మద్యం’ : మహిళలే టార్గెట్

  • 28 మే 2018
ఆల్కోపాప్ Image copyright WWW.COCACOLA.CO.JP

కోకకోలా మొదటిసారిగా ఆల్కోపాప్(మద్యం శాతం తక్కువ స్థాయిలో కలిగిన పానీయం) ఉత్పత్తులను జపాన్‌లో విడుదల చేసింది. నిమ్మరుచి కలిగిన మూడు రకాల పానీయాలతో.. మహిళలు, యువత లక్ష్యంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది.

కంపెనీ 125 ఏళ్ల చరిత్రలో ఈ పానీయం 'సాటిలేనిది'గా కోకకోలా అభివర్ణించింది. ఈ మూడు రకాల ఆల్కోపాప్‌లలో 3% - 8% వరకూ ఆల్కహాల్ ఉంటుంది.

ఈ పానీయం తయారీ విధానాన్ని మాత్రం ఎప్పటిలాగే గోప్యంగా ఉంచింది. కానీ.. జపాన్‌లోని ప్రఖ్యాత 'చూ-హై' రకం పానీయాల నమూనాలో ఈ ఆల్కోపాప్‌లను విడుదల చేసింది. ఈ చూ-హై పానీయాలు.. స్థానికంగా లభించే స్పిరిట్, వివిధ పండ్ల రసాలతో కలిసి చేసినవై ఉంటాయి.

Image copyright AFP

'షోచూ-హై బాల్'ను క్లుప్తంగా చూ-హై అని అంటారు. ఈ ద్రావకాన్ని 'బీర్‌' కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ పానీయం మహిళల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.

జపాన్‌లో లభించే చూ-హై రకం పానీయాల్లో సాన్తొరీ, ఆసాహీ, కిరిన్ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ద్రాక్ష, నిమ్మ రుచులు ప్రఖ్యాతి చెందాయి.

Image copyright WWW.SUNTORY.CO.JP

ఈ ఆల్కోపాప్ పానీయాలు 1990 దశకాల్లోనే యూరప్, ఇంగ్లండ్ దేశాల్లో స్మిర్న్ఆఫ్ ఐస్, బకార్డీ బ్రీజర్‌ పేర్లతో ప్రఖ్యాతి చెందాయి.

ఈ ద్రావకాలు సాధారణ పానీయాల రుచుల్లో ఉండడంతో వీటి ద్వారా యువతను మద్యానికి ఆకర్షితులయ్యేట్లు చేస్తున్నారన్న వివాదం కూడా ఉంది.

అయితే.. ఇతర దేశాల్లో ఇలాంటి సరికొత్త ఉత్పత్తులను విడుదల చేసే ఆలోచన లేదని కోకకోలా తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)