అక్కడ ఫేస్‌బుక్‌పై 30 రోజులు నిషేధం

  • 29 మే 2018
జుకర్‌బర్గ్ Image copyright Getty Images

మీరు నెల రోజుల పాటు ఫేస్‌బుక్ లేకుండా ఉండగలరా? కానీ ఓ దేశ ప్రజలకు మాత్రం తప్పేలా లేదు.

ఫేస్‌బుక్‌ని నెల రోజుల పాటు నిషేధించాలని పపువా న్యూగినియా నిర్ణయించింది.

ఎఫ్‌బీలో ఎక్కువగా నకిలీ ఖాతాలున్నాయని భావించిన ఇక్కడి అధికారులు వాటి ప్రభావం తమ దేశంపై ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ దేశ సమాచార మంత్రి సాం బాసిల్ ఈ అంశంపై మాట్లడారు.

ఫేస్‌బుక్‌లో పోర్న్ చిత్రాలను, తప్పుడు సమాచారాన్ని ఉంచే వారిని గుర్తించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వమే కొత్తగా ఒక సోషల్ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో కూడా ఆలోచించాలని సూచించారు.

కేంబ్రిడ్జ్ అనలటికా వ్యహహారం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫేస్‌బుక్ విమర్శలను ఎదుర్కొంటోంది.

పపువా న్యూగినియాలో కేవలం 10 శాతం మందికే నెట్ అందుబాటులో ఉంది. అయినా ఈ దేశం ఆన్‌లైన్ సేవలను క్రమబద్ధీకరించేందుకు తీవ్ర చర్యలు చేపడుతోంది.

నెల రోజుల పాటు ఫేస్‌బుక్‌ను దేశంలో నిషేధించి.. ఈ సోషల్ నెట్ వర్క్ దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో విశ్లేషించాలని అనుకుంటోంది.

2016 సైబర్ చట్టాలను అతిక్రమిస్తుందా అనే విషయాన్నీ ఆరా తీయనుంది.

ఈ మేరకు బాసిల్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)