#BeingMuslim: 'స్వర్గానికీ, నరకానికి మధ్య దూరం అరగంటే..'
ఇటీవలి నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత వెనుకబడిన 20 జిల్లాల్లో 11 జిల్లాలు ముస్లింలు ఎక్కువగా ఉండేవే.
వీటిలో మేవాత్ జిల్లా అన్నింటికన్నా పై స్థానంలో ఉంది. హరియాణా రాష్ట్రంలోని ఈ జిల్లా వైద్యం, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లోనూ వెనుకబడే ఉంది.
ముస్లింలు అత్యధికంగా ఉండే ఈ జిల్లా దేశ రాజధానికి అతి సమీపంలో, ఆధునిక హంగులతో వెలిగిపోయే గుడ్గాంకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధి బాటలో ఎందుకంత వెనుకబడిపోయిందో తెలుసునే ప్రయత్నం చేశారు బీబీసీ ప్రతినిధి శాలూ యాదవ్.
ఇది కెమరాపర్సన్ డెబ్లిన్ రాయ్‌తో కలిసి ఆమె అందిస్తున్న క్షేత్రస్థాయి కథనం.
దేశంలో దళితులు, ముస్లింలు సాధించిన విజయాల గురించీ, అలాగే వారి వెనుకబాటుకు కారణాల గురించీ బీబీసీ వరుసగా కథనాలు అందిస్తోంది . అందులో భాగమే ఇది.
ఈ సిరీస్‌లోని కథనాలన్నింటినీ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)