'టీచర్లూ.. పిల్లలను ఎవరైనా టచ్ చేస్తే మమ్మీకి చెప్పాలని పాఠాల్లో నేర్పించండి..'

'టీచర్లూ.. పిల్లలను ఎవరైనా టచ్ చేస్తే మమ్మీకి చెప్పాలని పాఠాల్లో నేర్పించండి..'

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ పష్తో గాయని నజియా జావెద్ తన సోదరుడే తన పిల్లలపై అత్యాచారం చేశారని కేసు నమోదు చేశారు.

పాకిస్తాన్‌లో బాలల హక్కుల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ 'సాహిల్' వెల్లడించిన వివరాల ప్రకారం పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల్లో అత్యధిక కేసుల్లో నిందితులు దగ్గరి బంధువులే.

పన్నెండు, ఎనిమిదేళ్ల వయస్సున్న తన ఇద్దరు పిల్లలూ తన సోదరుడు ఇఫ్తీకర్ పోకడలపై ఫిర్యాదు చేసినప్పుడు తాను అర్థం చేసుకోలేకపోయానని, అతణ్ని గుడ్డిగా నమ్మానని నజియా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ఏ తల్లితండ్రులూ తమ పిల్లలు చేసే ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని ఆమె అంటున్నారు. పిల్లలను ఎవరైనా టచ్ చేస్తే ఆ విషయం వారు తమ తల్లులకు చెప్పేలా స్కూళ్లలో టీచర్లు బోధించడం అవసరమని నాజియా దంపతులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)