#FIFA2018: ప్రారంభ మ్యాచ్‌లో సౌదీ ఆరేబియాపై రష్యా ఘన విజయం

రష్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫిఫా 2018 - ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రారంభ పోటీలో రష్యా చాలా స్టైల్‌గా శుభారంభం చేసింది. సౌదీ అరేబియాను 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది.

1934లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఆతిథ్య జట్టు తన తొలి మ్యాచ్‌లో ఇంత భారీ తేడాతో గెలుపు సాధించడం ఇదే మొదటిసారి.

ఇటీవలి కాలంలో రష్యా వరుసగా పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చింది. గత ఏడు మ్యాచ్‌లలో రష్యన్ జట్టు ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో అది నలువైపులా విమర్శలను ఎదుర్కొంటోంది.

ఆఖరుకు రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ కూడా తన దేశ జట్టుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ఈ ప్రారంభ మ్యాచ్ జరిగింది.

రష్యన్ క్రీడాకారుడు డేనిస్ చెర్యాషెవ్ రెండు గోల్స్ సాధించగా, అలెగ్జాండర్ గోలోవిన్ ఒక గోల్ సాధించి, మరో రెండు గోల్స్‌‌లో కీలక సాయం అందించాడు.

ఆర్టెమ్ జ్యూబా, యూరీ గజిన్స్కీయ్, రోమన్ జోబ్నిన్ ఒక్కో గోల్ సాధించారు.

దాదాపు 80 వేల మంది హాజరైన ఈ మ్యాచ్‌ ఆద్యంతం సౌదీ అరేబియాపై రష్యా పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)