481/6 వన్‌డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ సంచలనం

  • 19 జూన్ 2018
బెయిర్ షో Image copyright Getty Images

వన్‌ డే క్రికెట్‌లో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. ఆస్ర్టేలియాపై 50 ఓవర్లలో 481 పరుగులు చేసింది. ఆరు వికెట్లు కోల్పోయింది.

నాటింగ్ హాం‌లోని ట్రెండ్ బ్రిడ్జ్ గ్రౌండ్‌లో ఈ స్కోరు చేసింది.

ఇంతకు ముందు వన్డే మ్యాచ్‌లో అత్యధిక స్కోరు 444. పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ ఈ స్కోరు చేసింది.

ఈ 444 పరుగులు కూడా ఇంగ్లండ్ ఈ మైదానంలోనే చేసింది.

ఇంగ్లండ్ తర్వాత అత్యధిక స్కోరు రికార్డు శ్రీలంక పేరిట ఉంది.

శ్రీలంక 2006లో నెదర్లాండ్స్‌పై 443 పరుగులు చేసింది.

తాజా మ్యాచ్‌లో హేల్స్ 92 బంతుల్లో 147 పరుగులు చేశాడు. బెయిర్ స్టో 92 బంతుల్లో 139 పరుగులు చేశాడు.

టాస్ గెలిచిన ఆస్ర్టేలియా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)