అడ్డుకాదు అంగవైకల్యం
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

చక్రాల కుర్చీలో ఇలా డాన్స్ చేయడం చూశారా

  • 22 జూన్ 2018

మూడేళ్ళ వయసులోనే పోలియో బారిన పడిన సరితా తులంగ్ అద్భుతంగా నృత్యం నేర్చుకుని, ఇతరులకు కూడా నేర్పిస్తున్నారు. చక్రాల కుర్చీలో ఆమె నాట్యం చూస్తే మీరు మంత్రముగ్ధులవడం ఖాయం. నిజమో కాదో మీరే ఈ వీడియోలో చూడండి.

ఈమె పేరు సరితా తులంగ్. స్వస్థలం నేపాల్లోని సున్సారీ జిల్లాలో ఉంది. ప్రస్తుతం కాఠ్మాండూలో ఉంటున్నారు.

ఈమెకు మూడేళ్ల వయసులో పోలియో సోకింది. కుడి కాలు చచ్చుబడి పోయింది.

నిల్చోలేక పోయినా ఈమె డ్యాన్స్ చేయగలరు.

చదువుకుంటూనే నృత్యం నేర్చుకున్నారు. ఇప్పుడు ఇతరులకు కూడా నేర్పించగలుగుతున్నారు.

2005లో భారత్‌లో జరిగిన అంతర్జాతీయ నృత్య పోటీల్లో ఈమె గెలిచారు. డాన్స్ ఒక్కటే కాదు ఈత పోటీల్లోనూ ఈమె గెలిచారు.

వీల్ ఛైర్ బాస్కెట్‌ బాల్ కూడా ఆడతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)