నగరంలో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేదా? సగం ఇల్లు కొంటే ఎలా ఉంటుంది?

  • 28 జూలై 2019
సగం ఇల్లు

నగరాల్లో ఇల్లు కొనుక్కునే స్తోమతు లేని వారి కోసం చిలీ ఆర్కిటెక్ట్ ఒకరు వినూత్న పరిష్కారం చూపుతున్నారు. అది.. సగం ఇల్లు!

ప్రపంచంలో విపరీతంగా పెరుగుతున్న పట్టణ జనాభా నివాస సమస్యకు ఇది పరిష్కారం కావచ్చునని ఆర్కిటెక్ట్ అలెజాండ్రో అరావెనా భావిస్తున్నారు.

ఈ విధానంలో అందుబాటు ధరల్లో నాణ్యమైన ఇల్లు లభిస్తుందని ఆయన అంటారు. అంతేకాదు.. ఆ సగం ఇంట్లో ఉండే యజమానులు తాము కోరుకుంటే మిగతా సగం ఇంటిని ఎప్పుడు కొనుక్కోవాలి? దానిని ఎలా మార్చుకోవాలి? అనేదానిని నిర్ణయించుకోవచ్చు కూడా.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఇక్కడ సగం ఇల్లు కొనుక్కోవచ్చు

నగరాలకు వస్తున్న జనాభాకు అందుబాటు ధరల్లో ఇళ్లు లభించకపోతే దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుందని ఆయన అంటారు.

చిలీలోని విల్లా వెర్దెలో ఈ తరహా ఇళ్లు 500 నిర్మించారు. అవన్నీ దాదాపుగా నిండిపోయాయి.

ఘనా, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, లలో కూడా ఈ తరహా ఇళ్లు నిర్మించారు.

మరి మన నగరాల్లోనూ పైన వీడియోలో చూపించిన ఐడియా పనిచేస్తుందంటారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)