మహిళల శరీరంపై వెంట్రుకలు కనిపించే ఆ ప్రకటనపై అంత చర్చ ఎందుకు?

  • 2 జూలై 2018
మహిళల శరీరం వెంట్రుకలు Image copyright BILLIE ON UNSPLASH
చిత్రం శీర్షిక రేజర్ బ్రాండ్ అయినప్పటికీ బిలీ మహిళలు తమ శరీరంపై వెంట్రుకలు షేవ్ చేసుకునే టేబూను తొలగించాలని అనుకుంటోంది

'వెంట్రుకలు అందరి శరీరాలపైనా ఉంటాయి'.

ఇది చాలా మామూలు విషయం. కానీ అమెరికాలో ప్రస్తుతం ఇదే విషయం మీద చర్చ నడుస్తోంది. నిజానికి ఒక రేజర్ తన ప్రకటనలో మహిళలు తమ శరీరంపై ఉన్న వెంట్రుకలు షేవ్ చేసుకుంటున్నట్టు చూపించింది.

షేవ్ చేసుకుంటున్న మహిళలను చూపించడం అనేది అంత అభ్యంతరకరమేమీ కాదు. కానీ సాధారణంగా మహిళల శరీర భాగాలను ప్రకటనల్లో మొదట్నుంచీ షేవ్ చేసినట్టు చూపిస్తుంటే, ఈ ప్రకటనలో మాత్రం వారి శరీరంపై ఉన్న వెంట్రుకలను కూడా చూపించారు.

ఈ ప్రకటన రూపొందించిన రేజర్ బ్రాండ్ బిల్లీ గత 100 సంవత్సరాలలో ఏదైనా ఒక ప్రకటనలో మహిళల శరీరంపై వెంట్రుకలు చూపించడం ఇదే మొదటిసారి అని చెప్పింది. ఫలితంగా ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అయిపోయింది.

'చాలా అందంగా ఉంది'

సోషల్ మీడియాలో చాలా మంది మహిళలు ఈ ప్రకటనకు తమ మద్దతు తెలిపారు. తమ కాళ్లు, చేతులు, వేళ్లపై ఉన్న వెంట్రుకలు, దట్టమైన కనుబొమ్మలు, పొట్టపై కనిపించే వెంట్రుకల ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రాం యూజర్ @bigparadethroughtown "ఇది చాలా అందంగా ఉంది" అని రాశారు. @hanguk0 అనే మరో యూజర్, తాను రేజర్ ఉపయోగించనని, కానీ ఈ ప్రకటన చాలా అద్భుతంగా ఉందని, దానితో ఏకీభవిస్తున్నానని చెప్పారు.

"బ్రాండ్స్ అన్నీ మొదట్నుంచీ మహిళల శరీరంపై వెంట్రుకలు లేకుండా చూపిస్తూ వస్తున్నాయి, ఇది ఒక రకంగా బాడీ షేమింగ్ లాంటిదే" అని బిల్లీ సహ స్థాపకులు గార్జినా గులీ గ్లామర్ మేగజీన్‌తో అన్నారు.

"మన శరీరంపై వెంట్రుకలు ఉన్నందుకు మనం సిగ్గుపడుతున్నట్టు అవి చూపిస్తున్నాయి" అని ఆమె చెప్పారు.

Image copyright BILLIE ON UNSPLASH
చిత్రం శీర్షిక ఈ ప్రకటనతో శరీరంపై ఉన్న వెంట్రుకల గురించి తమ ఉద్దేశం మారిందని చాలా మంది మహిళలు చెబుతున్నారు

ఈ ప్రకటనతోపాటూ ఈ కంపెనీ ఒక ఆన్‌లైన్ ప్రచారం కూడా ప్రారంభించింది. "ఏ మహిళైనా తన సహజ సౌందర్యాన్ని అంగీకరించాలనేదే మా ఉద్దేశం" అని చెబుతోంది.

అయితే, దీనికి మద్దతు పలకడంతోపాటూ కొంతమంది ఈ రేజర్ బ్రాండ్‌కు ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఒక రేజర్ కంపెనీ శరీర వెంట్రుకలపై ఉన్న నిషేధాన్ని తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తోందని అడిగారు.

"శరీరంపై వెంట్రుకలు ఉండటం సైద్ధాంతికంగా ఎందుకు సరికాదో 11 ఏళ్ల వయస్సులో అర్థం చేసుకోకపోయి ఉంటే నేను కూడా షేవింగ్ మొదలుపెట్టేదాన్ని కాదు. మిగతా మహిళల్లాగే వెంట్రుకల్లేని కాళ్ల మృదుత్వాన్ని నేను కూడా ఆస్వాదిస్తాను, ఇప్పటికీ" అని రచయిత రేచల్ హాంప్టన్ అమెరికా వెబ్‌సైట్ స్లేట్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

రేజర్లు అమ్మే ఒక కంపెనీ శరీరంపై వెంట్రుకలు ఉండడంలో ఎలాంటి తప్పూ లేదని చెప్పగలదా? ఆ వెంట్రుకలు తొలగించటంలో దాని పాత్ర లేదా?

ఈ వివాదానికి పరిష్కారంగా బిల్లీ కంపెనీ చెబుతోంది ఏమంటే.. "మీరు ఎప్పుడు షేవ్ చేసుకోవాలని అనిపించినా, మీకోసం మేం సిద్ధంగా ఉన్నాం" అని.

Image copyright BILLIE ON UNSPLASH
చిత్రం శీర్షిక ఈ ప్రకటనను సమర్థిస్తున్న మహిళలు తమ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు

అంతే కాదు, మహిళలందరూ తమ శరీరాన్ని పూర్తిగా షేవ్ చేసుకోవడం అనేది తప్పనిసరి కాదని ఆ కంపెనీ తమ ప్రకటన చివర్లో చూపించింది.

"షేవ్ చేసుకోవడం అనేది వారి వారి వ్యక్తిగత నిర్ణయం. మహిళలు తమ శరీరంపై ఉండే వెంట్రుకలను ఏం చేయాలి అనేది చెప్పే హక్కు ఎవరికీ లేదు" అని బిల్లీ కంపెనీ సహ వ్యవస్థాపకులు గులీ అన్నారు.

"మనలో కొందరు ఈ వెంట్రుకలను తొలగించాలని అనుకుంటే, కొందరు వాటిని తమతో సగర్వంగా ఉంచుకోవాలని అనుకుంటారు. ఎవరు ఎలా చేయాలనుకున్నా, తమ ఇష్టాల గురించి వారు పశ్చాత్తాపానికి గురికావడమో, లేదా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అవిశ్వాసం: బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల రాజకీయ వ్యూహాలేంటి?

మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?

ఇంక్లవ్ డేటింగ్ యాప్: వీలైతే వికలాంగులతో నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ, అన్నీ కలిస్తే అంతకు మించి!

రూటు మారుస్తున్న కిమ్: ఎడాపెడా తనిఖీలు, చెడామడా తిట్లు

‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?

‘అది భార్యాభర్తల పడక సీన్‌... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’

అయోమయంలో అమెరికా.. రష్యా జోక్యంపై ట్రంప్‌దో మాట, ఇంటెలిజెన్స్‌ది ఇంకో మాట

‘నీళ్లు తాగి ప్రాణాలు నిలుపుకున్నాం.. ’: మీడియాతో థాయ్‌ బాలలు