చూసి తీరాల్సిందే: ప్రపంచంలో అత్యంత తెలివైన కాకి ఇదేనేమో
దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ఓ చిన్న ద్వీపంలో ఉన్న కాకుల్లో అద్భుతమైన తెలివితేటలు ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు.
న్యూ కాలెడోనియా ద్వీపంలోని కాకులు వాటికవే గాలాలను తయారు చేసుకుంటాయి.
చెట్ల దుంగలకు ఉన్న రంధ్రాలలో ఉండే పురుగులను బయటకు రప్పించేందుకు ఆ గాలాలను వినియోగిస్తాయి.
ఆ పురుగులు బయటకు రాగానే తినేస్తాయి.
అయితే, అడవిలో అనేక రకాల చెట్లు ఉంటాయి. కానీ ఈ కాకులు మాత్రం తమ వేట కోసం ఎప్పుడూ ఒకే రకమైన చెట్టు పుల్లలనే వినియోగిస్తాయి.
మరోవైపు వెండింగ్ మెషీన్నూ వాడేస్తున్నాయి.
ఈ పక్షుల మేధస్సును మరింత లోతుగా పరీక్షించేందుకు.. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్. సారా జెల్బర్ట్ ప్రత్యేకంగా ఓ వెండింగ్ మెషీన్ తయారు చేశారు.
దాని లోపల చిన్నచిన్న మాంసం ముక్కలు ఉంటాయి.
ఈ మెషీన్లోకి కాగితం ముక్కలు వేసినప్పుడు.. లోపలి నుంచి ఓ మాంసం ముక్క బయటకు వస్తుంది.
ఈ మెషీన్ను కూడా ఇక్కడి కాకులు చాలా తెలివిగా వాడేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- #గ్రౌండ్రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్లో గాలి ఎందుకిలా మారింది?
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)