థాయ్‌లాండ్ బాలురు: పాతాళ గుహలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

థాయ్‌లాండ్ బాలురు: పాతాళ గుహలో 9 రోజులు చిక్కుకున్నా ప్రాణాలు నిలుపుకున్నారు

  • 3 జూలై 2018

థాయ్‌లాండ్‌ గుహల్లో సందర్శనకు వెళ్లి అదృశ్యమైన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్ కోచ్‌ను.. తొమ్మిది రోజుల తర్వాత సజీవంగా గుర్తించారు.

పది రోజులుగా ఉద్విగ్నంగా నిరీక్షిస్తున్న థాయ్ ప్రజలకు ఈ పరిణామం సంతోషం కలిగించింది. అయితే.. వరద నీటితో నిండిన ఈ గుహల నుంచి వీరిని బయటకు తీసుకురావటం మరో సవాలుగా మారింది.

వరద నీటిలో ఈదుకుంటూ బయటకు రావాలని, అలా రావాలంటే వాళ్లు గజఈతగాళ్ల తరహాలో ఈత నైపుణ్యాలు నేర్చుకోవాలని ఆర్మీ అధికారులు తెలిపారు. గత తొమ్మిది రోజులుగా గుహలోనే చిక్కుకుపోయిన వీరికి ఈ నైపుణ్యాలను నేర్పటం కూడా సవాలే.

అది సాధ్యంకాకుంటే వరద నీటిని పూర్తిగా తోడేసిన తర్వాత బయటకు తీసుకురావొచ్చు. ఇందుకు కనీసం నాలుగు నెలలు సమయం పడుతుందని, అప్పటి వరకూ ఈ బాలలకు అవసరమయ్యే ఆహారాన్ని గుహలోకి పంపించాల్సి ఉంటుందని సైన్యాధికారులు వివరించారు.

సమగ్ర కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)