ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయా? లేవా?

ఏలియన్స్ ఉన్నాయా, లేవా

మనిషి ఎన్నో ఏళ్ల నుంచి గ్రహాంతరవాసుల కోసం అన్వేషిస్తున్నాడు. శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలు పంపి ఏలియన్స్‌తో సంప్రదింపులు జరపాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కానీ మనిషి పంపిన ఏ సందేశానికీ ఏలియన్స్ ఇప్పటివరకూ జవాబు ఇవ్వలేదు.

మానవుల సందేశాలకు ఏలియన్స్ ఎందుకు స్పందించడం లేదు. అసలు అవి ఉన్నాయా, లేవా?

ఫొటో సోర్స్, SPL

"అవి ఎక్కడున్నాయి?"

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ 1950లో తన సహచరుడిని ఇలా అడిగాడు.

ఈ విశ్వంలోని వివిధ గ్రహాలపై మనిషి లాంటి ఎన్నో తెలివైన జీవులు ఉండవచ్చని ఫెర్మీ భావించారు.

గ్రహాంతరవాసులు ఉంటే మనల్ని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏలియన్స్ అసలు ఎక్కడున్నాయి.

ఈ ప్రశ్న చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రశ్నకు విరుద్ధంగా వచ్చిన వాటిని "ఫెర్మీ పారడాక్స్" అనే పేరుతో పిలుస్తారు.

ఎస్ఈటీఐ(సెటి) అంటే "సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్" అనే సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రశ్నకు జవాబు వెతుకుతోంది.

ఫొటో సోర్స్, Science Photo Library

ఫొటో క్యాప్షన్,

ఎన్రికో ఫెర్మీ

మన గెలాక్సీలోనే కనీసం 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యావేత్తలు విరుద్ధమైన ఫెర్మీ పారడాక్స్ గురించి మళ్లీ లెక్కలేశారు.

వారు దీనికి సంబంధించి ఒక అధ్యయనం చేశారు. దానికి "డిజాల్వింగ్ ద ఫెర్మీ పారడాక్స్" అని పేరు పెట్టారు.

ఈ అధ్యయనం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న ఒకే ఒక బుద్ధిజీవి మానవుడు మాత్రమే అని అంచనా వేశారు.

అంటే దీనర్థం ఒకటే. విశ్వంలో ఏలియన్స్ ఉండడం అనేది దాదాపు అసాధ్యం.

ఈ నిర్ణయానికి ఎలా వచ్చారు

ఈ అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల్లో ఎండర్స్ సాండ్‌బర్గ్ ఒకరు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకులు.

మరో శాస్త్రవేత్త పేరు ఎరిక్ డ్రెక్స్‌లర్. ఈయన నానోటెక్నాలజీ కాన్సెప్ట్ చాలా ప్రసిద్ధి చెందింది.

వీరితోపాటు అకడమిక్ సెంటర్‌లో ఫిలాసఫీ ప్రొఫెసర్ టాడ్ ఆర్డ్ కూడా ఈ అధ్యయనం కోసం పనిచేశారు..

ఫొటో సోర్స్, SPL

ఈ సరికొత్త అధ్యయనంలో ఫెర్మీ పారడాక్స్‌లోని "డ్రెక్ సమీకరణం" అనే ఒక గణిత ఆధారాన్ని విశ్లేషించారు.

డ్రెక్ సమీకరణాన్ని మొదట్లో కూడా ఉపయోగించేవారు. దీని ద్వారా ఏయే గ్రహాలపై జీవం ఉండచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారో వాటి జాబితాను తయారు చేయవచ్చు.

ఈ అధ్యయనంలో జీవుల మనుగడకు సంబంధించిన ఎన్నో అంశాలను పరిశీలించిన తర్వాత, విశ్వంలో ఉన్న ఒకే ఒక తెలివైన ప్రాణి మనిషి మాత్రమే అనడానికి 39 శాతం నుంచి 85 శాతం అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

"విశ్వంలో వేరే బుద్ధి జీవులు లేవని చెప్పడానికి ఒక స్పష్టమైన అవకాశాన్ని మేం గుర్తించాం. అలాంటి సంకేతాలు లభించకపోతే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తీవ్రమైన అనిశ్చితి ఆధారంగా విశ్వంలో మనం మాత్రమే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండచ్చని మేం ఒక నిర్ణయానికి వచ్చాం" అని వారు తమ అధ్యయనంలో పేర్కొన్నారు.

అయితే, ఏలియన్స్ లేదా విశ్వంలోని ఇతర భాగాల్లో ఉన్న జీవుల కోసం అన్వేషణ కొనసాగించాలని ఈ అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"ఏలియన్స్ ఉండే అవకాశం తక్కువే అయినా, ఎక్కడైనా ఏదైనా తెలివైన గ్రహాంతరవాసి ఉండచ్చని భవిష్యత్తులో అనిపిస్తే, మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు" అని అధ్యయనంలో పాల్గొన్న సాండ్‌బర్గ్ అన్నారు.

అంటే ఫెర్మీ పారడాక్స్‌కు పరిష్కారం అంత సులువు కాదనే అనుకోవాలి.

వీడియో క్యాప్షన్,

వీడియో: అంతరిక్షంలో వ్యోమగాములు టాయిలెట్‌కి ఎలా వెళ్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)