ఇరాన్‌: డాన్స్ చేసిన యువతి అరెస్ట్ - నృత్యాలతో మహిళల నిరసన

  • 9 జూలై 2018
డాన్స్ వీడియో మద్దతు Image copyright INSTAGRAM / MAEDEH_HOZHABRI

డాన్స్ చేసిందనే అభియోగంతో ఒక టీనేజీ యువతిని ఇరాన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి వ్యతిరేకంగా ఇరాన్ మహిళలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.

టీనేజర్‌ను అరెస్ట్ చేయడం పట్ల వీరంతా తమ డాన్స్‌తో నిరసన తెలుపుతున్నారు.

చాలా మంది ఇరాన్‌ యువతులు తమ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన యువతికి అండగా నిలుస్తున్నారు.

మెదేహ్ హోజబ్రీ ఇరానియన్, వెస్ట్రన్ పాప్ సంగీతానికి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసి వేలాది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు.

శుక్రవారం హోజబ్రీ తన నేరాన్ని అంగీకరించినట్టు స్థానిక టీవీ ప్రసారం చేసింది.

ఆమెకు మద్దతుగా సోషల్ మీడియా యూజర్లు వీడియోలు, సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

#dancing_isn't_a_crime అనే అర్థం వచ్చేలా హాష్‌టాగ్స్ ఉపయోగిస్తున్నారు.



బహిరంగంగా డాన్స్ చేయడంపై నిషేధం

కుటుంబ సభ్యుల ముందు తప్ప, ఇతరుల ముందు, ముఖ్యంగా పురుషులు ముందు మహిళలు, మహిళల ముందు పురుషులు బహిరంగంగా డ్యాన్స్ చేయడంపై ఇరాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

బురఖా / హిజబ్ లేకుండా ఇంట్లో డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియోల్లో హోజబ్రీ కనిపించింది.

గత కొన్ని వారాలుగా, ఇలాగే డ్యాన్స్ చేసిన మరికొందరు డ్యాన్సర్లను కూడా ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

"పిల్లలపై అత్యాచారాలు చేసేవారు, ఇతరులు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు, అసభ్యతను వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న 17, 18 ఏళ్ల బాలికలను అరెస్ట్ చేశారని, ప్రపంచంలో ఎక్కడైనా చెబితే నవ్వుతారు. ఎందుకంటే వారు దాన్ని నమ్మలేరు" అని హుస్సేన్ రోనఘీ తన బ్లాగ్‌లో కామెంట్ పెట్టారు.




"నేను డ్యాన్స్ చేస్తున్నా, ఇది చూసి వాళ్లు (అధికారులు) మెదేహ్ లాంటి యువతులను అరెస్ట్ చేసి మా సంతోషాన్ని, ఆశలను తీసుకెళ్లలేరనే విషయం తెలుసుకోవాలి" అని ఒక ట్విటర్ యూజర్ రాశారు.


డాన్స్ చేసినందుకు ఇరాన్‌లో డ్యాన్సర్లను అరెస్ట్ చేసిన ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి.

ఈ ఏడాది మొదట్లో మష్షద్ నగరంలోని ఒక మాల్‌లో మహిళలు, పురుషులు గుంపుగా డ్యాన్స్ చేశారు.

ఆ వీడియో బయటపడడంతో ఆ నగరంలోని ఒక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గత ఏడాది ఆగస్టులో జుంబా డ్యాన్స్ చేసిన ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు.

2014లో ఫార్రెల్ విలియమ్స్ 'హ్యాపీ' పాటకు టెహ్రాన్ వీధుల్లో డాన్స్ చేసిన ఆరుగురు ఇరాన్ యువతీ, యువకులు ఆ వీడియోను పోస్ట్ చేశారు.

వారికి ఏడాది జైలు, 91 కొరడాదెబ్బల శిక్ష విధించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్

ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే సీఏఏపై బీజేపీ రాజకీయం: కేసీఆర్

అమరావతిలో జర్నలిస్టులపై నిర్భయ కేసు: ఆ రోజు మందడం స్కూల్లో ఏం జరిగింది?

కరోనా వైరస్: వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు ఇప్పుడేం చేస్తున్నారు

CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు

కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది

టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు, 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

వీడియో: షాహీన్‌బాగ్‌ నిరసనల్లో పాల్గొంటున్న మూడు తరాల ముస్లిం మహిళలు

కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'