LIVE: థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ‘హై రిస్క్ ఆపరేషన్‌’

  • 9 జూలై 2018
థాయ్‌ల్యాండ్, ఫుట్‌బాల్, పిల్లలు, గుహ Image copyright Getty Images

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 'హై రిస్క్ ఆపరేషన్‌' కాసేపట్లో మళ్లీ ప్రారంభంకాబోతోంది. గుహలో చిక్కుకున్న 13మందిలో ఇప్పటి వరకు నలుగుర్ని క్షేమంగా బయటి తీసుకొచ్చారు.

8:15AM

థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న మిగతా వారిని కాపాడేందుకు గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు.

ఆదివారం సహాయ బృందాలు నలుగురు పిల్లలను బయటికి తీసుకురాగా, మిగతా 8 మంది పిల్లలు, వారి ఫుట్ బాల్ కోచ్ ఇంకా వరద నీళ్లు నిండిన గుహలోనే ఉన్నారు.

8:00AM

గుహలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ బృందాలు ప్రమాదకరమైన ఆపరేషన్ కోసం సిద్ధమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కాసేపట్లో మళ్లీ మొదలుకాబోతోంది.

6:00AM

గుహ నుంచి పిల్లలను తీసుకొచ్చే దారిలో ఆక్సిజన్ ట్యాంకులు మార్చడం పూర్తయింది.

గత రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిలిపేశారు. సుమారు 10 గంటల పాటు శ్రమించి ఆక్సిజన్ ట్యాంకులు అమర్చారు.

థాయ్‌లాండ్‌లోని గుహలో 16 రోజులుగా చిక్కుకున్న ఫుట్‌బాల్ ఆటగాళ్ల బృందంలోని నలుగురిని రెస్క్యూ టీం నిన్న క్షేమంగా బయటకు తీసుకొచ్చింది.

థాయ్‌లాండ్ రెస్క్యూ ఆపరేషన్‌కి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ పేజీ ఇది.

Image copyright AFP

"గుహలోకి వెళ్లే దారి అంతటా ఆక్సిజన్ ట్యాంకులను అమర్చిన తర్వాత డైవర్లు మళ్లీ సహాయ కార్యక్రమాలు ప్రారంభిస్తారు" అని చాంగ్ రాయ్ గవర్నర్ ఆదివారం తెలిపారు.

చీకటిలో నీళ్లు నిండిన దారుల్లోంచి గుహ ప్రవేశ మార్గం వైపు ఎలా రావాలో డైవర్లు పిల్లలకు చూపిస్తున్నారు. నడుస్తూ గుహ దాటేలా వారిని సన్నద్ధం చేశారు.

వర్షం ఆగితే, అనుకున్న సమయం కంటే ముందే 'హై రిస్క్ ఆపరేషన్' ప్రారంభించాలని సహాయ బృందాలు భావిస్తున్నాయి.

సహాయ కార్యక్రమాల మొదటి దశను కూడా అధికారులు కాస్త ముందే ప్రారంభించారు.

Image copyright EPA

పిల్లల్ని ఎలా తీసుకొస్తున్నారు

90 మంది గజ ఈతగాళ్లు గుహలో వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిలో థాయ్‌లాండ్ డైవర్లు 40 మంది, ఇతర దేశాలకు చెందిన డైవర్లు 50 మంది ఉన్నారు.

గుహలో కఠినమైన దారుల్లో పిల్లలు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లి వారిని మళ్లీ ప్రవేశ మార్గం వరకూ తీసుకురావడం ఎంతో అనుభవం ఉన్న ఈతగాళ్లకు కూడా కష్టం అవుతోంది.

ఈ సహాయ కార్యక్రమాలలో భాగంగా గుహలో నడవడంతోపాటు, ఎక్కడం, గైడింగ్ రోప్స్ ద్వారా ఈదడం చేయాల్సి వస్తోంది.

రెస్పిరేటర్ల బదులు డైవర్లు అందరూ ఫుల్ ఫేస్ మాస్కులు వేసుకున్నారు. ఒక్కో బాలుడిని ఇద్దరు డైవర్లు తీసుకొస్తున్నారు. పిల్లాడికి అందిస్తున్న ఆక్సిజన్ ట్యాంకును కూడా డైవర్లే మోస్తున్నారు.

గుహ నుంచి బయటికి వస్తున్నప్పుడు సగం దూరంలో ఉన్న టీ-జంక్షన్ అనే ప్రాంతం దగ్గర డైవర్లకు కష్టంగా ఉంటోంది. అది చాలా ఇరుగ్గా ఉండడంతో డైవర్లు తమ ఆక్సిజన్ ట్యాంకులు తీసి దాన్ని దాటాల్సి వస్తోంది.

ఆ గుహలోనే ఉన్న చాంబర్ 3 అనే ప్రాంతం నుంచి డైవర్లు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. లోపలి నుంచి తీసుకొచ్చిన వారు, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత చాంగ్ రాయ్‌లోని ఉన్న ఆస్పత్రికి పంపుతున్నారు.

Image copyright Getty Images

మొదటి దశ సహాయ కార్యక్రమాలు

  • స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం 10.00 గంటలకు సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
  • మొదట ఆరుగురిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా, పలు వార్తా సంస్థలు వెల్లడించాయి.
  • అయితే అధికారులు మాత్రం ఆదివారం సాయంత్రానికి నలుగురిని బయటకు తెచ్చామని చెప్పారు.
  • మొదట బలహీనంగా ఉన్న వారిని బయటకు తీసుకొస్తున్నారు
  • ఆదివారం రెండు అంబులెన్సుల్లో నలుగురు పిల్లలను ఆస్పత్రికి తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

#FIFA2018: 20 ఏళ్ల తర్వాత కప్పుగొట్టిన ఫ్రాన్స్

మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా

ప్రెస్ రివ్యూ: కత్తి మహేశ్‌, పరిపూర్ణానందలను ఎందుకు బహిష్కరించామంటే.. గవర్నర్‌కు కేసీఆర్ వివరణ

ఇతను సంగీతంతో ఆటిజాన్ని జయించాడు, వారానికి ఓ భాష నేర్చుకుంటున్నాడు

హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎందుకు, ఎలా పొందుతున్నారంటే..

#FIFA2018: పది ఫొటోల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ హైలైట్స్, రికార్డులు, అవార్డులు

ట్విటర్‌ ఫేక్ ఖాతాల ప్రక్షాళన: తెలుగు ప్రముఖుల ఫాలోవర్లలో అసలెందరో, నకిలీలెందరో తెలుసుకోండి

‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన