#fifa2018: బెల్జియం, క్రొయేషియా: చిన్న దేశాలు, పెద్ద విజయాలు

  • 10 జూలై 2018
ఫీఫా ప్రపంచ కప్, రష్యా, బెల్జియం, క్రొయేషియా Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్రొయేషియా స్టార్ లూకా మోడ్రిక్

బెల్జియం, క్రొయేషియాలు తమకన్నా మంచి టీమ్‌లను ఓడించి ఫీఫా ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్స్‌కు చేరాయి.

రెండు చిన్న దేశాలు సెమీ ఫైనల్స్‌కు చేరడమనేది చాలా పెద్ద విషయం.

సాధారణంగా దేశం ఎంత పెద్దగా ఉంటే, దానిలో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల సంఖ్య అంత ఎక్కువగా ఉంటుందని, విజయం సాధించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం ఉంది.

గత ప్రపంచ కప్ విజేతలను పరిశీలిస్తే, ఉరుగ్వే తప్ప మిగతా దేశాలన్నీ ఎక్కువ జనాభా కలిగినవే - బ్రెజిల్ జనాభా 20.7 కోట్లు, జర్మనీ జనాభా 8.3 కోట్లు, ఫ్రాన్స్ జనాభా 6.7 కోట్లు, ఇటలీ జనాభా 6 కోట్లు, ఇంగ్లండ్ 5.3 కోట్లు కాగా అర్జెంటీనా జనాభా 4.3 కోట్లు.

ఈసారి బెల్జియం, క్రొయేషియాలు ఆ ట్రెండ్‌ను మార్చేశాయి. చాకొలేట్లు, బీర్‌కు పేరొందిన బెల్జియంకు అర్జెంటీనా నుంచి మాత్రమే గట్టి పోటీ ఎదురైంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచ కప్‌ను గెల్చుకున్న అతి తక్కువ జనాభా కలిగిన దేశం ఉరుగ్వే

ఇది ఎలా సాధ్యమైంది?

చిన్న దేశాలు ఇలా సాధించడం అసాధ్యమేమీ కాదు. దీనికి ఉదాహరణ ఉసేన్ బోల్ట్. అనేక స్వర్ణ పతకాలు సాధించిన ఈ స్ప్రింటర్ కేవలం 21 లక్షల మంది జనాభా ఉన్న జమైకా నుంచి వచ్చాడు. అయితే ఫుట్‌బాల్ లాంటి క్రీడల్లో అలాంటివి జరగడం చాలా కష్టం.

బెల్జియం, క్రొయేషియాలు తమకు మంచి పట్టున్న అంశాలపై దృష్టి పెట్టి, వాటిని పూర్తిగా ఉపయోగించుకున్నాయి.

ప్రపంచంలోని 20 అత్యంత ధనిక దేశాలలో బెల్జియం ఒకటి. బెల్జియన్లు ఈ క్రీడను చాలా సీరియస్‌గా తీసుకుంటారు.

ఈయూ గణాంకాల ప్రకారం, ఆ దేశంలో 2010లోనే 17 వేల ఫుట్‌బాల్ క్లబ్‌లు ఉన్నాయి. వాటిలో 13.5 లక్షల మంది అంటే దేశ జనాభాలో సుమారు 10 శాతం మంది వాటిలో సభ్యులు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సంబరాలు చేసుకుంటున్న బెల్జియం క్రీడాకారులు

యువ క్రీడాకారులకు ప్రోత్సాహం

2006లో బెల్జియం ఫుట్‌బాల్ అధికారులు దేశవ్యాప్తంగా ఉన్న యూత్ క్లబ్‌లలో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల ప్రోత్సాహం కోసం ఒక ప్రణాళికను రూపొందించారు.

దాని ఫలితంగానే మనం ఇప్పుడు ఈడెన్ హజార్డ్, కెవిన్ డి బ్రయన్, రోమెల్ లుకాకు లాంటి క్రీడాకారులను చూస్తున్నాం.

లుకాకు తల్లిదండ్రులు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి బెల్జియం వచ్చి స్థిరపడ్డారు. మొదటి, రెండో తరం శరణార్థులలో ఉన్న యువ టాలెంట్‌ను కనిపెట్టే ప్రణాళికలో భాగంగానే లుకాకు సామర్థ్యం వెలుగులోకి వచ్చింది.

ఈ టీమ్‌లో ఇంకా మొరాకో, పోర్చుగల్, కొసావోల నుంచి బెల్జియం వచ్చి స్థిరపడ్డ కుటుంబాల నుంచి వచ్చిన క్రీడాకారులున్నారు.

స్టార్ ప్లేయర్లు

ఇక క్రొయేషియా విషయం కొంచెం భిన్నం. ఆ దేశానికి బెల్జియం వద్ద ఉన్నన్ని ఆర్థిక నిధులు లేవు. అయితే ఆ దేశం విజయాలకు కారణం యూగొస్లేవియా నుంచి విడిపోవడానికి ముందు అక్కడ క్రీడలపై ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులే.

క్రొయేషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మాజీ టెక్నికల్ డైరెక్టర్ రోమియో జోజాక్ - ఫుట్‌బాల్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, వాటర్ పోలో, తదితర క్రీడల్లో నాణ్యమైన కోచింగే తమ విజయాలకు కారణమని తెలిపారు.

అక్కడ క్రీడల్లో పాల్గొనాలంటే అత్యున్నత ప్రమాణాలు సాధించాల్సి ఉంటుంది.

క్రొయేషియాలో రిజిష్టరైన ఫుట్‌బాల్ క్రీడాకారుల సంఖ్య 1.2 లక్షలు. ఇది దేశ జనాబాలో 3 శాతం. అదే బ్రెజిల్ విషయానికి వస్తే అది 1 శాతం కన్నా తక్కువ.

అనేక అంతర్జాతీయ క్లబ్‌లకు ఆడుతున్న క్రీడాకారుల వల్ల కూడా ఈ రెండు దేశాలు బాగా ప్రయోజనం పొందాయి.

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో 11 మంది బెల్జియం క్రీడాకారులు ఉన్నారు. క్రొయేషియాకు చెందిన అతి పెద్ద స్టార్ లూకా మోడ్రిక్ రియల్ మాడ్రిడ్‌లో కీలక ప్లేయర్.

నిజానికి ఈ రెండు టీముల్లోను ఇద్దరిద్దరు క్రీడాకారులు తప్ప మిగతా వారంతా ఇతర దేశాల నుంచి వచ్చి బెల్జియం, క్రొయేషియాలలో స్థిరపడిన వారే.

ఈ టీమ్‌లు రష్యా వరకు వెళ్లడానికి వారే ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ఎన్‌కౌంటర్: నిందితుల మృతదేహాలు అప్పగించాలని కుటుంబ సభ్యుల ఆందోళన

INDvsWI T20 : టీమిండియా టార్గెట్ 208 పరుగులు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’.. క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'