థాయిలాండ్ గుహలో బాలలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ: ఆ అబ్బాయి తీసుకెళ్లిన ఆహారమే అందరి ఆకలి తీర్చింది

దాదాపు రెండు వారాల కిందట థాయ్‌లాండ్‌లోని ఒక గుహలో 12 మంది పిల్లలు, వారి ఫుట్‌బాల్ కోచ్ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిని రక్షించేందుకు రెస్క్యూం టీం శ్రమిస్తోంది.
ఇంతకీ ఆ గుహలో చిక్కుకున్న 12 మంది బాలురు, వారి కోచ్ ఎవరు? ఇన్నిరోజుల పాటు వారు గుహలోనే ఎలా జీవించగలిగారు? తమను రక్షించడానికి వచ్చిన బ్రిటిష్ గజ ఈతగాళ్లతో ఎలా మాట్లాడగలిగారు?
వీటికి సమాధానం తెలుసుకోవాలంటే జట్టులోని సభ్యులైన పీరాపట్ సోంమియాంజయ్, అబ్దుల్ సమన్ల గురించి తెలుసుకోవాలి.
పీరాపట్ సోంమియాంజయ్ 17 (నిక్‌నేమ్: నైట్) - గుహలో చిక్కుకున్న రోజే ఇతని పుట్టిన రోజు. బర్త్ డే పార్టీని గుహలో జరుపుకునేందుకు స్నాక్స్ తీసుకెళ్లినట్లు తెలిసింది.
గుహలో చిక్కుకుపోయిన ఇన్ని రోజులపాటు వారికి ఈ స్నాక్సే ఆకలి తీర్చాయని మీడియా కథనాలు తెలిపాయి.
మా అబ్బాయి బయటకు వచ్చే వరకు బర్త్ డే పార్టీ వాయిదా వేస్తున్నామని ఇతని తల్లిదండ్రులు తెలిపారు.
అబ్దుల్ సమన్(14) : ఇతని స్వస్థలం మియన్మార్. బాగా చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇతన్ని థాయ్‌లాండ్ తీసుకొచ్చారు. అబ్దుల్‌కి థాయ్‌తో పాటు, బర్మీస్, చైనీస్, ఇంగ్లిష్ భాషలు కూడా వచ్చు.
బ్రిటీష్ గజ ఈతగాళ్లు గుహలో చిక్కుకున్న వీరిని గుర్తించినప్పుడు వాళ్లతో ఇంగ్లీష్‌లో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి అబ్దుల్. మిగిలిన వారికి ఇంగ్లీష్ రాదు.
- థాయ్ గుహలో బాలలు: బయటకు ఎలా తీసుకురావాలి?
- థాయ్‌లాండ్ గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎనిమిది మంది బాలలు.. ఇక మిగిలింది నలుగురే
- మేఘాలయ: ‘దేవతల గుహ’లో దాగిన రహస్యాలు
గుహలో చిక్కుకున్న మిగిలిన బాలల గురించి వారి తల్లిదండ్రులు, టీచర్లు చెప్పిన విశేషాలు
- చానిన్ విబుల్ రుంగ్రూంగ్, 11 ( నిక్‌నేమ్: టైటాన్) - ఏడేళ్లకే ఫుట్‌బాల్ ఆడటం మొదలు పెట్టాడు. గుహలో చిక్కుకున్న వారిలో ఇతనే అత్యంత పిన్నవయస్కుడు.
- పనుమాస్ సంగ్దీ, 13 (నిక్‌నేమ్:మిగ్) - 'నేవీ సీల్స్' మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. కోచ్ మాటల్లో చెప్పాలంటే టీంలో అందరికంటే చురుకైనవాడు.
- దుగన్పేట్ ప్రొంటెప్, 13 (నిక్‌నేమ్: డోమ్) - వైల్డ్ బోర్స్ జట్టుకు కెప్టెన్, థాయ్‌లోని చాలా జట్లకు నాయకత్వం వహించాడు. టీంలోని ఆటగాళ్లందరూ ఇతనిలోని ఫుట్‌బాల్ నైపుణ్యం చూసి గౌరవిస్తారని తెలిసింది.
- సోంపెంగ్ జాయివాంగ్ 13 (నిక్‌నేమ్: పోంగ్) - థాయ్ జాతీయ జట్టుకు ఆడాలనేది ఇతని లక్ష్యం అని తెలిసింది.
- మొంగోల్ బూనియమ్, 13 (నిక్‌నేమ్:మార్క్) - చాలా మంచి విద్యార్థి, అందరిని గౌరవిస్తాడని ఇతని టీచర్లు తెలిపారు. ఫుట్ బాల్‌ను ఎంతగా ఇష్టపడతాడో చదువుకోడానికి అంతే ఇష్టపడతాడని మొంగోల్ తండ్రి ఏఎఫ్పీకి చెప్పారు.
- నట్ట్వాట్ టాక్మోరాంగ్, 14 (నిక్‌నేమ్: టెర్న్) - నా గురించి బాధపడొద్దని తల్లిదండ్రులకు లేఖ రాశాడు.
- ఎక్రాట్ వోంగ్సుక్చాన్, 14 (నిక్‌నేమ్: బేవ్) - గుహ నుంచి బయటకు వచ్చాక తప్పకుండా నీకు సహాయం చేస్తానని అమ్మకు మాట ఇచ్చాడు.
- ప్రజాక్ సుతమ్ 15 (నిక్‌నేమ్:నోట్) - నెమ్మదస్తుడు, మంచి కుర్రాడని ఇతని ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పారు.
- పిపట్ ఫో, 15 (నిక్‌నేమ్:నిక్) - గుహ నుంచి బయటకు వచ్చాక అమ్మానాన్నలను రెస్టారెంట్‌కు తీసుకెళ్తానని లేఖ రాశాడు.
- పోర్నిచాయి కమ్లూంగ్ 16 (నిక్‌నేమ్:టీ) - ''బాధ పడకండి, నేను బాగానే ఉన్నాను'' అని పేరెంట్స్‌కు లేఖ రాశాడు.
- సహాయక కోచ్ ఎక్కాపల్ చాంట్వాంగ్ 25 (నిక్‌నేమ్: ఆకే) - గుహలో చిక్కుకున్న నేపథ్యంలో క్షమించమని తల్లిదండ్రులకు లేఖ రాశాడు. తనతో ఉన్న బాలురను జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- ప్రాణాలు కాపాడిన వీడియోకాల్
- చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయా?
- హాలీవుడ్ సినిమాల రేంజ్లో జైళ్ల నుంచి తప్పించుకున్నారు వీళ్లంతా
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)