Live: కోచ్ సహా 12 మంది బాలలు సురక్షితం : నేవీ అధికారులు

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న బాలలను బయటకు తీసుసుకొచ్చే ప్రక్రియ మూడో రోజు ప్రారంభమైంది. తొలి రెండు రోజులు ఎనిమిది మంది బాలలను గుహ నుంచి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మూడో రోజుకు ఐదుగురు లోపలే ఉన్నారు. వారిలో నలుగురు పిల్లలు. ఒకరు ఫుట్‌బాల్ కోచ్. వీరిని కూడా మంగళవారం సాయంత్రానికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
17:21
గుహలో చిక్కుకున్నవారు అందర్నీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న నేవీ అధికారి బీబీసీకి తెలిపారు. ప్రపంచం ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఓ బృహత్ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన అన్నారు.
17:11
సహాయక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ముగ్గురు పిల్లలను గుహ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు బీబీసీకి తెలిపారు.
16:30 ‘మాకు బ్రెడ్డు, చాకొలెట్స్ కావాలి’ : పిల్లలు
గత ఆదివారం.. గుహ నుంచి బయటకు వచ్చి చికిత్స పొందిన నలుగురు పిల్లలు.. ప్రఖ్యాత థాయ్‌లాండ్ వంటకం ‘బేసిల్ స్టిర్ - ఫ్రై’ కావాలని అడిగారు. కానీ పిల్లల జీర్ణశక్తి సరిగా లేదని వైద్యులు చెప్పడంతో.. వారు ‘పోరిడ్జ్’తో సరిపెట్టుకోవలసి వచ్చింది.
కానీ ఈరోజు బయటకు వచ్చిన పిల్లలు బ్రెడ్డు, చాకొలెట్స్ కావాలని అడగడంతో.. వారు కోరింది ఇచ్చామని వైద్య శాఖ మంత్రి మీడియాకు తెలిపారు.
(ఇది లైవ్ అప్డేట్స్ పేజీ. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.)
ఇప్పటి వరకు అందిన సమాచారం
- 11 మంది బాలలను ఈ గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు
- వీరందరూ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు
- మరో ముగ్గురు ఈ గుహ నుంచి బయటకు రావాల్సి ఉంది
- నిపుణులైన డైవర్ల సాయంతో వీరిని బయటకు తెస్తున్నారు
- 12 మంది బాలలు ఫుట్‌బాల్ కోచ్ రెండు వారాల కిందట ఈ గుహలో చిక్కుకున్నారు
16:10
వీరంతా మళ్లీ మామూలు పిల్లలు ఎప్పుడవుతారు?
ఈ ఆపరేషన్‌లో సురక్షితంగా బయటపడ్డ పిల్లలు తిరిగి సాధారణ జీవితానికి అలవాటు పడే క్రమంలో ఎదుర్కొనే మానసిక ఇబ్బందుల గురించి బీబీసీ ఇదివరకే ప్రస్తావించింది.
2010లో చిలీ దేశానికి చెందిన 33 మంది గని కార్మికులు కూడా ఇలాగే కోపియాపో ప్రాంతంలోని భూగర్భంలో 69 రోజులు చిక్కుకుపోయారు. మొదటి 17 రోజులూ.. బయటి ప్రపంచంతో వీరికి సంబంధాలు తెగిపోయాయి. తాము ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు.
వారిని కాపాడే కార్యక్రమాన్ని మీడియా లైవ్‌లో ప్రసారం చేసింది. ఆ తర్వాత ఈ ఘటనపై ఓ సినిమాను కూడా తీశారు. సురక్షితంగా బయటపడ్డ అనంతరం, ఈ 33 మంది సాధారణ జీవితానికి అలవాటుపడటానికి, మీడియా ద్వారా వీరికి కొత్తగా వచ్చిన గుర్తింపుతో చాలా ఇబ్బంది పడాల్సివచ్చింది.
ప్రమాదం నుంచి బయటపడ్డాక తాను మానసికంగా చాలా కృంగిపోయానని కోపియాపో బాధితుడు కార్లోస్ బారియోస్ బీబీసీకి తెలిపారు. తాను మతిమరుపు, ఇన్సోమ్నియాతో కూడా బాధపడినట్లు ఆయన వివరించారు.
ఒమర్ రేయ్గడాస్ అనే మరో బాధితుడు బీబీసీతో మాట్లాడుతూ..
''ఆ సంఘటన నా జీవితాన్నే మార్చేసింది. గతంలో నేను నా పిల్లలు, మనుమలు మనుమరాళ్లతో సరదాగా గడిపేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది'' అని అన్నారు.
16:02 పదకొండోబాలుడు బయటకు
11వ పిల్లవాడిని గుహ నుంచి బయటకు తీసుకురావడం కనిపించిందని రాయిటర్స్ తెలిపింది. ఈరోజు గుహ నుంచి బయటకొచ్చిన పిల్లలు.. గుహ ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన ఫీల్డ్ హాస్పిటల్ వద్ద వేచివున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
15.40 ఎలాన్ మస్క్ మినీ జలాంతర్గామి అవసరం లేదు
అమెరికా టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. బాలుర రక్షణకు కొత్త ప్రతిపాదన చేశారు.
ఆయన తాము రూపొందించిన మినీ జలాంతర్గామితో బాలురను బయటకు తీసుకురావొచ్చని ప్రతిపాదించారు.
ఈ మేరకు మస్క్ గుహ వద్దకు వెళ్లినపుడు తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెట్టారు.
అయితే ఈ ప్రతిపాదనను థాయ్ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికే తాము అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు.
15.14 పదో బాలుడు బయటకు
రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించిన వార్త మేరకు పదో బాలుడిని బయటకు తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు.
15.10 తొమ్మిదో బాలుడు బయటకు
పిల్లల్ని ఎలా తీసుకొస్తున్నారు?
90 మంది గజ ఈతగాళ్లు గుహలో వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
వీరిలో థాయ్‌లాండ్ డైవర్లు 40 మంది, ఇతర దేశాలకు చెందిన డైవర్లు 50 మంది ఉన్నారు.
చీకటిలో నీళ్లు నిండిన దారుల్లోంచి గుహ ప్రవేశ మార్గం వైపు ఎలా రావాలో డైవర్లు పిల్లలకు చూపిస్తున్నారు.
నడుస్తూ గుహ దాటేలా వారిని సన్నద్ధం చేశారు.
గుహలో కఠినమైన దారుల్లోంచి పిల్లలు చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లి వారిని మళ్లీ ప్రవేశ మార్గం వరకూ తీసుకురావడం ఎంతో అనుభవం ఉన్న ఈతగాళ్లకు కూడా కష్టం అవుతోంది.
సహాయ కార్యక్రమాలలో భాగంగా గుహలో నడవడంతోపాటు, పాకడం, గైడింగ్ రోప్స్ ద్వారా ఈదడం చేయాల్సి వస్తోంది.
రెస్పిరేటర్ల బదులు డైవర్లు అందరూ ఫుల్ ఫేస్ మాస్కులు వేసుకున్నారు.
ఒక్కో బాలుడిని ఇద్దరు డైవర్లు కలిసి తీసుకొస్తున్నారు.
పిల్లాడికి అందిస్తున్న ఆక్సిజన్ ట్యాంకును కూడా డైవర్లే మోస్తున్నారు.
గుహ నుంచి బయటికి వస్తున్నప్పుడు సగం దూరంలో ఉన్న టీ-జంక్షన్ అనే ప్రాంతం దగ్గర డైవర్లకు కష్టంగా ఉంటోంది.
అది చాలా ఇరుగ్గా ఉండడంతో డైవర్లు తమ ఆక్సిజన్ ట్యాంకులు తీసి దాన్ని దాటాల్సి వస్తోంది.
ఆ గుహలోనే ఉన్న చాంబర్ 3 అనే ప్రాంతం నుంచి డైవర్లు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
లోపలి నుంచి తీసుకొచ్చిన వారు, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత చాంగ్ రాయ్‌లోని ఉన్న ఆస్పత్రికి పంపుతున్నారు.
గుహలో ఎలా చిక్కుకున్నారు?
గుహ లోపల వారం కిందట బ్రిటీష్ డైవర్లకు ఈ బాలురు కనిపించారు.
గుహ బయటి నుంచి వీరు చిక్కుకుపోయిన ప్రాంతం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వీరంతా 11 నుంచి 17 ఏళ్ల మధ్యనున్నవారే. వైల్డ్ బోర్స్ అనే ఫుట్ బాల్ క్లబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
విహారయాత్రలో భాగంగా కోచ్‌తో కలసి ఈ గుహకు వచ్చారు.
- ప్రజ్ఞానంద: అక్కను ఓడించాలని చెస్ నేర్చుకున్నాడు.. ఇప్పుడు గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు
- లోయలో పడిపోయి ఆరు రోజులు తిండీ, నీళ్లు లేకుండా బతికింది..
బాలలకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించే అవకాశం
థాయ్‌లాండ్ గుహ నుంచి ప్రాణాలతో బయటపడిన బాలలకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించే అవకాశం ఇప్పటికీ ఉంది.
రష్యాలో జరిగే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు రావాలని ఫిఫా అధ్యక్షుడు గియాన్నో ఇన్పాంటినో బాలలను ఆహ్వానిస్తూ గత శుక్రవారం లేఖ రాశారు.
గుహలో చిక్కుకున్న బాలలకు తమ మద్దతు ఉంటుందని, వారి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నామని థాయ్ ఫుట్ బాల్ అసోసియేషన్‌కు రాసిన ఆ లేఖలో ఇన్పాంటినో తెలిపారు.
''గుహలోంచి వారు సరైన సమయంలో బయటపడి, ఇక్కడికి వచ్చే స్థితిలో ఉంటే..అంతకంటే సంతోషకరమైన వార్త ఉండదు'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- స్పైడర్‌మ్యాన్ సహ సృష్టికర్త మృతి
- హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- #లబ్‌డబ్బు: ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా..
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)