పట్టుసాధిస్తున్న సిరియా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

తూర్పు ఘూటాపై పట్టుసాధిస్తున్న ప్రభుత్వ దళాలు

  • 12 జూలై 2018

సిరియాలోని తూర్పు ఘూటాపై ప్రభుత్వ దళాలు పట్టు సాధిస్తున్నాయి. సంకీర్ణ దళాల మద్ధతుతో అసద్ సేనలు ప్రత్యర్థులను అణచివేస్తూ పురోగమిస్తున్నాయి.

సిరియాలోని డెరాలో రిపోర్టింగ్ చేసేందుకు ఇక్కడి అధికారులు బీబీసీని అనుమతించలేదు. జోర్డాన్ సరిహద్దుల్లో ఉండటం వల్ల వ్యూహాత్మకంగా ఇది కీలక ప్రాంతం. 2011లో అధ్యక్షుడు అసద్ కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు ప్రారంభమైంది ఇక్కడే.

రష్యా సాయంతో సిరియా ప్రభుత్వం బాంబుల వర్షం కురిపిస్తూ పురోగమిస్తోంది. సరండర్ కాబోమంటూ కొన్ని రెబెల్ గ్రూపులు వీడియో ఫుటేజిల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి.

వాళ్లకు ఆయుధాలు శిక్షణ ఇచ్చిన అమెరికా దళాలు తమ నుంచి ఎటువంటి సాయం ఆశించకూడదంటూ స్పష్టం చేశాయి. మరికొన్ని తిరుగుబాటు దళాలు రష్యా మధ్యవర్తిత్వంతో లొంగిపోవడం గురించి చర్చలు సాగిస్తున్నాయి.

ఈ యుద్ధంలో మరోసారి సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఈ దృశ్యాలు ముసెఫ్రా గ్రామంలో వారం క్రితం జరిగిన వైమానిక దాడుల నేపథ్యంలో చిత్రీకరించినవి. ఈ దాడిలో 12 మంది చిన్నారులతో కలుపుకొని 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ వాహనంలో షబుతోపాటు గాయపడ్డ కొంతమంది కూడా ఉన్నారు. ఆసుపత్రులపైనా బాంబుల దాడులు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఏ స్థాయిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారంటే వారి అంత్యక్రియలు కూడా జరపలేని పరిస్థితి నెలకొంది.

ఇప్పుడు ఈ ప్రాంతంపైనా ప్రభుత్వ దళాలు పట్టు సాధించాయి.

ఈ యుద్ధం వల్ల చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరి భద్రత పట్ల సహాయక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. జోర్డాన్ సరిహద్దు వద్ద వారికి సాయం అందుతోంది. కానీ, ఇప్పటికే పది లక్షల మంది సిరియన్లు జోర్డాన్ లో ఆశ్రయం పొందుతున్నందున కొత్తవారిని అనుమతించడం లేదు. అందుకే, శరణార్థులు గోల్డెన్ హైట్స్ సరిహద్దు వద్ద ఆశ్రయం పొందుతున్నారు. ఇది సిరియా కు చెందిన ప్రాంతమే కానీ, ఇజ్రాయెల్ అధీనంలో ఉంది.

ఇజ్రాయెల్ కూడా సహాయక సామగ్రిని పంపించింది, కానీ శరణార్థుల కోసం సరిహద్దు తలుపులు మూసేసింది.

సిరియా సేనలు పట్టణంలో విజయ యాత్ర కూడా నిర్వహించాయి. మరిన్ని పట్టణాలను గెలుచుకొని మరిన్ని విజయ యాత్రలు చేయాలని అసద్ భావిస్తున్నారు. పశ్చిమ ఐరోపా దేశాలు, అమెరికా ఈ యుద్ధంలో బషర్ అల్ అసద్ గెలుస్తారని అంగీకరించినట్లు కనిపిస్తోంది. యుద్ధం ఇంకా ముగియలేదు, కానీ అసద్ ఇంకా అధికార పీఠాన్ని అధిష్ఠించే ఉన్నారు. అంతేకాదు, తన శత్రువులను ఒకరి తర్వాత ఒకరిని అంతం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)