అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?

ఇంగ్లాండ్‌లోని సెయింట్ పాల్స్ కెథడ్రల్ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌లో మరణించిన అమెరికన్ సైనికులను గుర్తు చేస్తుంది. చనిపోయిన 28 వేల మంది సైనికుల పేర్లు ఇక్కడ ఉన్నాయి.
రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక మంది ప్రాణ త్యాగం తరువాత రూపుదిద్దుకున్న ఒక కొత్త ప్రపంచ వ్యవస్థలో భాగంగా 1958లో దీన్ని ప్రారంభించారు. అమెరికా నాయకత్వంలోని అట్లాంటిక్ ఆర్డర్ గత ఏడు దశాబ్దాలుగా వికసిస్తూ వచ్చింది.
ఈ అట్లాంటిక్ ఆర్డర్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ స్థాపించారు. వారు సాధించిన విజయం నుంచే ప్రస్తుత ప్రపంచ ఆర్థిక నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ), మార్షల్ ప్లాన్, నాటో, యురోపియన్ యూనియన్ ఆవిర్భవించాయి.
ఒక అంతర్జాతీయ వ్యవస్థలో రాజకీయాలు, భద్రత, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిర్దేశించుకున్న నియమ నిబంధనలకు, పరిమితులకు లోబడే ప్రతి దేశం ముందుకు సాగాలి. కానీ వీటి ద్వారా అమెరికాకు ఏమీ ఒరగట్లేదని ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు.
ట్రాన్స్ అట్లాంటిక్ రిలేషన్షిప్
ప్రస్తుత అమెరికా మిత్ర దేశాల ముందున్న ప్రశ్న ఒక్కటే- అందరికి ఆమోదయోగ్యమైన నిబంధనలతో ఫ్రాంక్లిన్ రూజెవెల్ట్ ప్రారంభించిన ఒక వ్యవస్థను ట్రంప్ ముగించనున్నారా?
"ఆయనకు చరిత్ర గురించి తెలియదు, పట్టించుకోరు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు వెళ్లినట్లు, అంతర్జాతీయ సంబంధాల విషయంలో కూడా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ వ్యవస్థలో అమెరికా పెట్టుబడి పెడుతోంది. ఆ పెట్టుబడి ఈ వ్యవస్థ కొనసాగడానికి అవసరం. మరే ఇతర దేశం ఈ పని చేయలేదు. అంతేకాదు, ఈ నిబంధనలతో తయారైన వ్యవస్థ వల్ల అమెరికాకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆ ప్రయోజనాలను డాలర్లు, సెంట్లలో లెక్కించడం చాలా కష్టం. ఇది దీర్ఘకాలిక ప్రతిపాదన. కానీ ట్రంప్ దీన్ని ఆ కోణంలో చూడడం లేదు" అని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మాజీ సలహాదారు జెర్మీ షాపిరో చెప్పారు.
ఏది ఏమైనా, త్యాగం అనే ముసుగులో ఏర్పాటయిన ఒక కూటమి కొనసాగించటానికయ్యే ఖర్చును భరించేందుకు సిద్ధంగా లేని అమెరికాను యూరప్ 70 ఏళ్లలో మొదటి సారి చూస్తోంది.
ఇవి కూడా చూడండి:
- డొనాల్డ్ ట్రంప్ దౌత్యనీతి: స్నేహితుడా.. శత్రువా.. ‘ఎవరైతే నాకేంటి’
- వాణిజ్య యుద్ధాలు మంచివేనన్న డొనాల్డ్ ట్రంప్.. మండిపడుతున్న చైనా, ఇతర దేశాలు
- జీ7: రష్యా లేకుండా ఈ మీటింగ్ ఏంటి.. రష్యాను మళ్లీ మన జట్టులో చేర్చుకోవాలి -ట్రంప్
- కోక్ తాగినా, చికెన్ తిన్నా ట్రంప్ ఆరోగ్యానికి ఢోకా లేదు!
- ట్రంప్ ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- #BBCArchives: ఫిడెల్ క్యాస్ట్రో అరుదైన వీడియో ఇంటర్వ్యూ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)