BreakingNews: పాక్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి, 85 మంది మృతి

  • 13 జూలై 2018
BBC

పాకిస్తాన్‌ ఎన్నికల ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 85 మంది చనిపోయారు. ఈ మేరకు పాక్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. వంద మందికిపైగా గాయపడ్డారని వివరించారు.

ఇక్కడ ఈ నెల 25న పాక్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

ఆరోగ్య శాఖ మంత్రి ఫైజ్ కాకర్ బీబీసీతో మాట్లాడుతూ.. వాయువ్య పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి సిరాజ్ రస్సానీ నియోజకవర్గంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని చెప్పారు.

Image copyright ...

ఈ దాడిలో సిరాజ్ కూడా మృతి చెందారని ఆయన సోదరుడు వెల్లడించారు.

దక్షిణ క్వెట్టాకి 35 కిలోమీటర్ల దూరంలో ఈ బాంబు పేలుడు జరిగిందని స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు.

బలూచిస్థాన్‌ ఎన్నికల నేపథ్యంలో గత 24 గంటల్లో మూడు బాంబు దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.

బలూచిస్థాన్ రాజధానికి సమీపంలోని మస్టంగ్ పట్టణంలో తాజా దాడి జరిగింది.

ఎన్నికల ర్యాలీ మధ్యలో ఒకరు తనను తాను పేల్చేసుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగిందిన అధికారులు వివరించినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

సంబంధిత అంశాలు