పాక్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి, 85 మంది మృతి

  • 13 జూలై 2018
ఎన్నికలు Image copyright Getty Images

పాకిస్తాన్‌ ఎన్నికల ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 85 మంది చనిపోయారు. ఈ మేరకు పాక్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. 150 మందికిపైగా గాయపడ్డారని వివరించారు.

ఇక్కడ ఈ నెల 25న ఎన్నికలు జరుగనున్నాయి.

ఆరోగ్య శాఖ మంత్రి ఫైజ్ కాకర్ బీబీసీతో మాట్లాడుతూ.. వాయువ్య పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి సిరాజ్ రస్సానీ నియోజకవర్గంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని చెప్పారు.

Image copyright ...

ఈ దాడిలో సిరాజ్ కూడా మృతి చెందారని ఆయన సోదరుడు వెల్లడించారు.

దక్షిణ క్వెట్టాకి 35 కిలోమీటర్ల దూరంలో ఈ బాంబు పేలుడు జరిగిందని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు.

బలూచిస్థాన్‌ ఎన్నికల నేపథ్యంలో గత 24 గంటల్లో మూడు బాంబు దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.

బలూచిస్థాన్ రాజధానికి సమీపంలోని మస్టంగ్ పట్టణంలో తాజా దాడి జరిగింది.

ఎన్నికల ర్యాలీ మధ్యలో ఒకరు తనను తాను పేల్చేసుకోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగిందిన అధికారులు వివరించినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

అయోధ్య కేసులో అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు

ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ : అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా ఈ చట్టంలో ఏముంది?

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌‌'పై త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, అమెజాన్‌కి మధ్య వివాదంలో లాభపడిన మైక్రోసాఫ్ట్

ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

అభిప్రాయం: పౌరసత్వ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేయవచ్చా...

గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?