లక్షల సంఖ్యలో విదేశీయులు రష్యాకు తరలి రావడం, ఆ దేశంలో మ్యాచ్‌లు జరిగిన పదకొండు నగరాల్లో పర్యటించడం రష్యన్లకు ఒక కొత్త అనుభూతిని మిగిల్చింది. ఈ క్రీడా పండుగ అక్కడి ప్రజల జీవితాలలో ఎటువంటి మార్పులు తెస్తుంది?
"ఎన్నో భావోద్వేగాలు! ఎంతో మంది విదేశీయులు రష్యాకు వచ్చారు. ఎంతోకాలంగా మేం కోల్పోయింది ఇదే."
"ఈ ఛాంపియన్షిప్ తిలకించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడకు చేరుకున్నారు, ఇది ఎంతో ఆసక్తికరం ఎంతో మందిని కలుసుకుంటున్నాం. కొత్త కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి" అంటున్నారు రష్యా ప్రజలు.
ఇదంతా.. కొన్ని దశాబ్దాల కింద జరిగిన ఇలాంటి సంబరాలను గుర్తుకు తెస్తోంది పాతతరం రష్యన్లకు.
1957లో వేల మంది విదేశీయులు మొదటిసారి సోవియట్ యూనియన్‌కు వచ్చారు.
’రష్యాలో జీవితం ఇంత వైవిధ్యంగా ఇంతకు ముందెన్నడూ లేదేమో. మా తరం వాళ్లం ఇతర దేశాలకు ప్రయాణిస్తూనే ఉన్నాం. అయితే, ఈ స్థాయిలో విదేశీయులు రష్యాలో కనిపించడం మాకు చాలా కొత్తగా ఉంది. ’
సోవియట్ పరిపాలనలో మహిళల ఫుట్‌బాల్‌ను నిషేధించారు. కానీ ఇపుడు పరిస్థితులు మారుతున్నాయి.
‘‘ఇది మా లోకల్ టీం. మా క్లబ్ పేరు "గర్ల్ పవర్". ఫుట్ బాల్ కూడా ఇతర క్రీడల లాంటిదేనని, మహిళలు కూడా ఈ క్రీడను ఆడొచ్చనడానికి మా క్లబ్ ఒక సంకేతం" అంటున్నారు మరియా ఇసాయేవ.
అందరి దృష్టిని ఆకర్షించే ఇలాంటి పేరే తమకు కావాలని యానా డావిడోవ చెప్పారు.
ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో రష్యాలో పరిస్థితులు మారతాయని గర్ల్ పవర్ భావిస్తోందా?
‘‘ఈ దేశ పౌరులుగా మేం సోదర భావంతో, సంతోషంగానే ఉంటున్నాం. అయితే మేం ఉంటున్న వ్యవస్థ మమ్మల్ని అనుమానాస్పదమైన వారనే భావన కలిగిస్తోంది. ఇపుడు, పరిస్థితి కొద్దిగా మారింది. ఇక్కడి ప్రజలు చాలా తొందరగా మారిపోయారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుందని, ప్రజలు తమ సహజ స్వభావంతో ఉండగలరని ఆశిస్తున్నా" అని మరియా ఇసాయేవ అభిప్రాయపడ్డారు.
ఒక నెల పాటు చిరునవ్వులు, సంబరాలతో విజయవంతంగా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను నిర్వహించిన రష్యా ఇపుడు ఒక భిన్నమైన ప్రాంతంలా కనిపిస్తోంది. అయితే, పరిస్థితులు ఇంకా మెరుగవుతాయా?
‘‘అవ్వొచ్చు, కాకపోవచ్చు. కానీ, మేం మా దేశానికి సంబంధించి నాణేనికి మరో వైపును ప్రపంచానికి చూపించాం. అందులోనూ, రష్యాకు, పశ్చిమ దేశాలకు మధ్య ఉద్రిక్త పరిస్థితుల పెరుగుతున్న సందర్భంలో ఇది నిజంగా ఒక గొప్ప విజయం’’ అంటున్నారు రష్యన్లు.
ఇవి కూడా చదవండి:
- #FIFA2018: రష్యాలో ఫుట్‌బాల్ అభిమానులకూ గూగుల్ ట్రాన్స్లేట్కి ఏంటీ సంబంధం?
- ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
- రొనాల్డో, మెస్సీ, నెయ్మరే కాదు.. వీరూ సాకర్ హీరోలే..
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- #FIFA2018: క్రికెట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న భారత్ ఫుట్‌బాల్‌లో ఎందుకు వెనకబడింది?
- #FIFA2018: 12 మైదానాలు, రూ.23వేల కోట్లు
- #FIFA2018: అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీకి అసలేమైంది?
- 195 కిలోల పులిని మరో చోటికి తరలించడం ఎలాగంటే..
- చరిత్రలో అత్యుత్తమ జట్లివే, వీటిలో ఒకటి కప్పు కొట్టలేదు
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
- లబ్..డబ్బు: ఫిఫా ప్రపంచకప్‌తో ఎవరెవరికి ఎంతెంత లాభమో తెలుసా
- క్రీడల్లో భారత్ కంటే ఉత్తర కొరియానే ముందు!!
- ఇథియోపియా - ఎరిత్రియాల మధ్య ముగిసిన యుద్ధం.. ఇరవయ్యేళ్ల వివాదానికి తెర
- హైదరాబాద్ రోహింజ్యాలు: ఆధార్ కార్డులు ఎలా పొందుతున్నారు? ఎందుకు పొందుతున్నారు?
- హైదరాబాద్‌లో రోహింజ్యాల ఫుట్‌బాల్ జట్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)