పాక్ ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి, 128 మంది మృతి

  • 14 జూలై 2018
పాకిస్తాన్ Image copyright EPA

పాకిస్తాన్‌ ఎన్నికల ర్యాలీలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 128 మంది చనిపోయారు. మరో 150 మందికిపైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

2014 తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన అతిపెద్ద దాడి ఇదే.

బలూచిస్తాన్‌లోని మస్టంగ్ పట్టణంలో జరిగిన ఈ దాడిలో బలూచిస్తాన్ అవామీ పార్టీ అభ్యర్థి సిరాజ్ రస్సానీతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ (ఎస్) ప్రకటించింది.

శక్తిమంతమైన బాంబును తన శరీరానికి అమర్చుకున్న ఓ వ్యక్తి ఎన్నికల ప్రచార ర్యాలీలోకి ప్రవేశించి పేల్చేసుకున్నాడని స్థానిక అధికారులు తెలిపారు.

"పేలుడు ధాటికి అనేక మంది దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. తీవ్రంగా గాయపడి చాలామంది హాహాకారాలు చేశారు" అని స్థానిక పాత్రికేయుడు చెప్పినట్టు ఏఎఫ్‌పీ న్యూస్ తెలిపింది.

Image copyright AFP

ఈ నెల 25న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా సాగుతున్నాయి.

ఆ ప్రచార కార్యక్రమాలే లక్ష్యంగా తాజాగా వరుస దాడులు జరుగుతున్నాయి.

బలూచిస్తాన్ ఎన్నికల నేపథ్యంలో గత 24 గంటల్లో మూడు బాంబు దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.

శుక్రవారమే బన్ను పట్టణంలోనూ ఇలాగే మరో ఎన్నికల ర్యాలీలో బాంబు దాడి జరిగింది. అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

2014 డిసెంబర్‌లో పెషావర్‌లోని ఆర్మీ స్కూలుపై తాలిబన్ మిలిటెంట్లు చేసిన దాడిలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 132 మంది చిన్నారులే. ఆ తర్వాత అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది తాజా దాడిలోనే.

మంగళవారం పెషావర్‌లో ఓ ఎన్నికల ప్రచార సభలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి సహా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ దాడి చేసింది తామేనని పాకిస్తాన్ తాలిబన్ సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ఎన్‌కౌంటర్: నిందితుల మృతదేహాలు అప్పగించాలని కుటుంబ సభ్యుల ఆందోళన

INDvsWI T20 : భారత్ బ్యాటింగ్ ప్రారంభం.. టార్గెట్ 208 పరుగులు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’.. క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?

'దిశ' తల్లి: 'నా బిడ్డ కూడా ఒక చెల్లిలాంటిదేనని వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే...'