గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ 'భారీ' దాడి

  • 15 జూలై 2018
గాజా Image copyright AFP
చిత్రం శీర్షిక గాజాలోని హమాస్ మిలిటెంట్ సంస్థ శిక్షణా కేంద్రంపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ తెలిపింది.

గాజాలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా భారీ వైమానిక దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇది 2014 గాజా యుద్ధం తర్వాత తాము జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని ఆయన అన్నారు.

తమ భూభాగంపై జరిగిన రాకెట్ల దాడులకు ప్రతిస్పందనగా ఈ వైమానిక దాడి జరిపినట్టు నెతన్యాహు వెల్లడించారు. అవసరమైతే మరిన్ని దాడులకూ వెనకాడబోమని అన్నారు.

అయితే.. పాలస్తీనా మాత్రం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉందని చెబుతోంది.

తాజా దాడుల వల్ల గాజా నగరంలో ఇద్దరు మరణించగా.. మరో 12 మంది గాయడినట్టు పాలస్తీనా వెల్లడించింది.

అంతకుముందు ఇజ్రాయెల్‌ భూభాగంపై దాదాపు 90 రాకెట్లు దాడి చేయగా.. ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.

గాజాలోని హమాస్ మిలిటెంట్ సంస్థ వినియోగిస్తున్న బెటాలియన్ హెడ్‌క్వార్టర్.. మిలిటెంట్ శిక్షణా కేంద్రం ఉన్న భారీ భవనం.. ఆయుధాగారం సహా పలు స్థావరాలపై తమ యుద్ధ విమానాలు దాడులు చేశాయని ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) వెల్లడించాయి.

ఈ దాడులకు సంబంధించినవిగా చెబుతూ రెండు వీడియోలను ఐడీఎఫ్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు.

గాజా నగరంలోని ఓ ఖాళీ భవనం మీద ఇజ్రాయెల్ దాడి చేసిందని, ఆ భవనం పక్కన వెళ్తున్న పాదచారులు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు రాయిటర్ వార్తా సంస్థకు తెలిపారు.

శుక్రవారం పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద ఆందోళనల సమయంలో ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో ఒక పాలస్తీనా పౌరుడు చనిపోయాడని హమాస్ పేర్కొంది.

మరోవైపు.. తమ ప్రాంతం మీద పాలస్తీనా డజన్ల కొద్దీ రాకెట్లతో దాడులు చేసిందని ఇజ్రాయెల్ అంటోంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption'గాజా రక్తమోడుతోంది... వాళ్లను చంపేస్తున్నారు'

గత కొన్ని నెలలుగా పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

ఇజ్రాయెల్‌లోని తమ పూర్వ స్వస్థలాలకు వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ పాలస్తీనాలోని వేలాది మంది సరిహద్దు వద్ద ఆందోళనలు చేస్తున్నారు.

అలాగే.. గాజాపై ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలు విధించిన నిషేధాజ్ఞలను, సరిహద్దుల మూసివేతను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కానీ.. తీవ్రవాదులను కట్టడి చేసేందుకు దిగ్బంధమే సరైన మార్గమని ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలు అంటున్నాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionజెరూసలెం: అమెరికా ఎంబసీ సంబురాలు.. గాజాలో కాల్పుల్లో మరణాలు

సరిహద్దు వద్ద ఆందోళనల సమయంలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 130 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోగా.. మరో 15,000 మంది గాయపడ్డారని గాజా వైద్య శాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ‘ఎన్‌కౌంటర్’... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?