#FIFA2018: ఫుట్‌బాల్ ప్రపంచ కప్.. ఫ్రాన్స్ 4 - 2 క్రొయేషియా

  • 15 జూలై 2018
గోల్ కొడుతున్న ఆంటోనీ గ్రిజ్‌మన్ Image copyright Reuters
చిత్రం శీర్షిక గోల్ కొడుతున్న ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్‌మన్

రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌‌లో ఫ్రాన్స్ 3-1 గోల్స్ తేడాతో ముందంజలో ఉంది.

మ్యాచ్ మొదలైన 19 నిమిషాల సమయంలో ఫ్రాన్స్‌కు తొలిగోల్ లభించింది. ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్‌మన్ కొట్టిన బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా క్రొయేషియా ఆటగాడు మారియో మన్‌డ్జుకిక్ తల అడ్డుపెట్టాడు. కానీ, ఆ బంతి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది.

దీంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ చేసిన తొలి ఆటగాడిగా మారియో మండ్జుకిక్ వార్తల్లోకి ఎక్కాడు.

ఆ తర్వాత మరో 10 నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సిసిక్ కోల్ కొట్టి స్కోరును సమం చేశాడు. 16 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన ఇవాన్‌కు ఈ టోర్నమెంట్‌లో ఇది మూడో గోల్.

మ్యాచ్ 38 నిమిషాల సమయంలో ఆంటోనీ గ్రిజ్‌మన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచటంతో ఫ్రాన్స్ పైచేయి సాధించింది. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సిసిక్‌ చేతికి బంతి తాకిందా? లేదా? అన్న సందిగ్ధంలో మ్యాచ్ రిఫరీ వీడియోను పరిశీలించి ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్ ఇచ్చాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గోల్ కొట్టిన ఆనందంలో ఫ్రాన్స్ యువ ఆటగాడు ఎంబపె

రెండో అర్థభాగంలోనూ మొదటి గోల్ ఫ్రాన్స్‌దే అయ్యింది. 59వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పొగ్బ గోల్ కొట్టి తమ జట్టు ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. కెలియన్ ఎంబప బంతిపై పట్టు సాధించి గోల్‌పోస్ట్ వరకూ తీసుకొచ్చి, ఆంటోనీ గ్రిజ్‌మన్‌కు అందించాడు. గ్రిజ్‌మన్ దాన్ని పొగ్బవైపు పంపగా.. పొగ్బ దాన్ని అద్భుతమైన గోల్‌గా మలిచాడు.

మ్యాచ్ 65వ నిమిషంలో కెలియన్ ఎంబపె మరో గోల్ కొట్టడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 4-1కి పెరిగింది.

అయితే మరో నాలుగు నిమిషాల్లోనే మారియో మండ్జుకిక్ తన గోల్‌తో క్రొయేషియా జట్టుకు ఊరట కల్పించాడు. దీంతో ఫ్రాన్స్ ఆధిక్యం 4-2కు తగ్గింది.

ఫ్రాన్స్, క్రొయేషియా రెండూ.. సెమీ ఫైనల్స్‌లో ఆడిన ఆటగాళ్లతోనే ఫైనల్ బరిలోకి దిగాయి.

ఈ కథనం అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)