#FIFA2018: పది ఫొటోల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్ హైలైట్స్, రికార్డులు, అవార్డులు

  • 16 జూలై 2018
Image copyright Getty Images
చిత్రం శీర్షిక తమ జట్టు ప్రదర్శన పట్ల గ్యాలరీలో నిలబడి ఆనందం వ్యక్తం చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ వంక చూస్తున్న క్రొయేషియా అధ్యక్షురాలు కిలిండా గ్రాబర్ కిటరోవిక్. చిత్రంలో ఫిఫా 2018కు ఆతిథ్యం ఇచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉన్నారు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫైనల్ మ్యాచ్ జరుగుతుందగా పోలీసు యూనిఫాంలో ఉన్న కొందరు అభిమానులు మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. తమ అభిమాన ఆటగాళ్లను కలిసేందుకు ప్రయత్నించారు. తక్షణం అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుని, మైదానం బయటకు తీసుకెళ్లారు. ఫ్రాన్స్ ఆటగాడు ఎంబపెతో చేతులు కలుపుతున్న ఒక మహిళా అభిమానిని ఈ చిత్రంలో చూడొచ్చు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో ఈఫిల్ టవర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్యాన్‌ జోన్‌ నుంచి భారీ సంఖ్యలో ఆ దేశ అభిమానులు మ్యాచ్‌ను తిలకించారు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక మ్యాచ్ 38 నిమిషాల సమయంలో ఆంటోనీ గ్రిజ్‌మన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచటంతో ఫ్రాన్స్ పైచేయి సాధించింది. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెర్సిసిక్‌ చేతికి బంతి తాకిందా? లేదా? అన్న సందిగ్ధంలో మ్యాచ్ రిఫరీ నెస్టర్ పినాటా వీడియోను పరిశీలించి (వీడియో అసిస్టెంట్ రిఫరీ - వీఏఆర్) ఫ్రాన్స్‌కు పెనాల్టీ కార్నర్ ఇచ్చాడు. ఈ వివాదాస్పద వీఏఆర్.. మ్యాచ్‌ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపింది

ఇవి కూడా చదవండి:

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మ్యాచ్ మొదలైన 19 నిమిషాల సమయంలో ఫ్రాన్స్‌కు తొలిగోల్ లభించింది. ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్‌మన్ కొట్టిన బంతి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లకుండా క్రొయేషియా ఆటగాడు మారియో మన్‌డ్జుకిక్ తల అడ్డుపెట్టాడు (చిత్రంలో కనిపిస్తున్నట్లుగా). కానీ, ఆ బంతి గోల్‌పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ చేసిన తొలి ఆటగాడిగా మారియో మండ్జుకిక్ వార్తల్లోకి ఎక్కాడు. అంతే కాదు.. ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో సెల్ఫ్‌గోల్, గోల్ చేసిన రెండో ఆటగాడు కూడా మారియో మండ్జుకిక్. ఇంతకు ముందు 1982లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో ఇటలీకి చెందిన మార్కో టర్డెల్లి కూడా ఇలాగే సెల్ఫ్‌గోల్, గోల్ చేశాడు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను గెల్చుకోవటం ఫ్రాన్స్‌కు ఇది రెండోసారి. పదేళ్ల కిందట సొంతగడ్డపై 1998లో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ను ఫ్రాన్స్ గెలిచింది. అంతేకాదు 1970 తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు గోల్స్ చేసిన తొలి జట్టు. అప్పట్లో ఇటలీని బ్రెజిల్ జట్టు 4-1తేడాతో ఓడించింది
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచకప్ ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఫ్రాన్స్ ఆటగాడు ఆంటోనీ గ్రిజ్‌మన్.

ఇవి కూడా చదవండి:

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫిఫా 2018 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఉత్తమ ఆటగాడిగా గోల్డెన్ బాల్ అవార్డు క్రొయేషియా ఆటగాడు లుకా మొడ్రిక్ (ఎరుపు, తెలుసు దుస్తుల్లో)కు లభించగా.. యంగ్ ప్లేయర్ అవార్డు ఫ్రాన్స్‌కు చెండిన కెలియన్ ఎంబపెకు లభించింది. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో గోల్ చేసిన అత్యంత పిన్న వయస్కుల్లో రెండో ఆటగాడియా ఎంబపె (19 ఏళ్ల 207 రోజులు) రికార్డులకెక్కాడు. మొదటి స్థానంలో బ్రెజిల్‌కు చెందిన స్టార్ ఆటగాడు పీలే (17 ఏళ్ల 249 రోజులు) ఉన్నాడు. కాగా, గత ప్రపంచకప్‌లో కూడా ఓడిపోయిన జట్టు ఆటగాడికే ఉత్తమ ఆటగాడి అవార్డు కింద గోల్డెన్ బాల్ లభించింది
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆటగాడిగా, మేనేజర్‌గా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ గెలిచిన మూడో వ్యక్తి ఫ్రాన్స్ జట్టు హెడ్ కోచ్, మేనేజర్‌గా ఉన్న డిడెర్ డెస్కాంప్స్. ఇంతకు ముందు బ్రెజిల్‌కు చెందిన మారియో జగాల్లో, జర్మనీకి చెందిన ఫ్రాంజ్ బెకెన్‌ బ్యూర్‌లు ఈ ఘనత సాధించారు
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫిఫా 2018 ప్రపంచకప్ ‘బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు’ బెల్జియం గోల్ కీపర్ తిబౌట్ కొర్టొయిస్‌కు లభించింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)