చిత్రమాలిక: మానసరోవర్ చూసొద్దాం రండి

మానసరోవర్

భారత్ నుంచి ఏటా చాలామంది ప్రజలు టిబెట్‌లోని కైలాశ్ మానసరోవర్ యాత్రకు వెళ్తుంటారు. ఆ యాత్రికుల్లో ఎక్కువ మంది ఇటీవలి కాలంలో దక్షిణ నేపాల్‌లోని హుమ్లా మార్గం గుండానే అక్కడికి చేరుకుంటున్నారు. మార్గ మధ్యలో కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించేందుకే యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది మానసరోవర్ యాత్రా మార్గంలోని చిత్రమాలిక ఇది.

ఏటా వేలాది మంది యాత్రికులు కైలాశ్ మానసరోవర్ సందర్శనకు వెళ్తుంటారు.

గత ఒక్క ఏడాదిలోనే 12వేల మంది యాత్రికులు నేపాల్‌ మీదుగా అక్కడికి వెళ్లారు. 2018లో ఇప్పటిదాకా 6వేల మంది ఆ మార్గాన్ని ఎంచుకున్నారు.

పర్వత ప్రాంతంలో ఉన్న మానసరోవర్‌ను చేరుకోవడం ఓ రకంగా సాహసమే.

కైలాశ్ మానసరోవర్ ప్రాంతాన్ని హిందువులు శివుడి నివాస స్థలంగా భావిస్తారు. సముద్ర మట్టానికి 6,638మీటర్ల ఎత్తులో అది ఉంది.

అనేక హిందూ పవిత్ర గ్రంథాల్లో మానసరోవర్ ప్రస్తావన ఉంది.

మానసరోవర్ చేరుకోవడానికి ఉన్న మూడు ప్రధాన మార్గాల్లో నేపాల్ మార్గం ఒకటి. భారత్ నుంచి మానసరోవర్ చేరుకోవడానికి ఒక్కో యాత్రికుడికి దాదాపు రూ.1.6లక్షలు ఖర్చవుతోంది.

ఏప్రిల్-జూన్ నెలల మధ్యలో మానసరోవర్ యాత్రకు అనువైన సమయం. కానీ అక్టోబర్ చివరి దాకా యాత్రికులు వస్తుంటారు.

మనసరోవర్‌లో స్నానంతో మోక్షం లభిస్తుందని హిందూ భక్తులు విశ్వసిస్తారు.

అక్కడికి వెళ్లే భక్తుల్లో ఎక్కువమంది భారతీయులే.

నేపాల్ గంజ్ నుంచి ఫ్లయిట్‌లో యాత్రికులు సిమికోట్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హిల్సా పట్టణానికి బయల్దేరతారు.

హిల్సా నుంచి రోడ్డు మార్గం ద్వారా టిబెట్‌లోని టాక్లకోట్ వెళ్తారు. అసలైన మానసరోవర్ యాత్ర అక్కడి నుంచే మొదలవుతుంది.

మరో వారం తరవాత తిరిగి టాక్లకోట్ చేరుకోవడంతో మానసరోవర్ యాత్ర ముగుస్తుంది.

(ఫొటోలు: కృష్ణ అధికారి)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)