హిమాలయన్ వయాగ్ర: కిలో రూ.70 లక్షలు

హిమాలయాల్లో ఓ అరుదైన ఔషధం దొరుకుతుంది. అదే ‘హిమాలయన్ వయాగ్ర’. ఇది కేవలం నపుంసకత్వానికి మాత్రమే మందు కాదు.. కేన్సర్, ఆస్తమా చికిత్సకు కూడా ఉపయోగపడుతుందని నాటు వైద్యులు చెబుతున్నారు.

ఈ హిమాలయన్ వయాగ్రను ‘యర్సగుంబా’ అంటారు. భారత్, నేపాల్, భూటాన్, టిబెట్‌లోని హిమాలయ ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కిలో రూ.70 లక్షలు. యర్సగుంబాను అమెరికా, ఇంగ్లండ్, చైనా, సింగపూర్, జపాన్, కొరియా, మయన్మార్, థాయ్‌లాండ్ లాంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.

గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒకరకమైన ఫంగస్ సోకి, అది మరణించాక యర్సగుంబాగా మారుతుంది. ఇది 3 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది.

ఈ ఔషధం గురించి మరిన్ని విషయాలు, విశేషాలు చూడాలనుకుంటే.. ఈ వీడియో క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)