చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’

  • 17 జూలై 2018
అసురలో ఒక సన్నివేశం Image copyright Youtube/ASURAFILMOFFICIAL

చైనాలో పురాణ గాథ ఆధారంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'అసుర' ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

సుమారు రూ.765 కోట్లు(750 మిలియన్ యువాన్లు)తో నిర్మించిన ఈ చిత్రాన్ని వారాంతంలో థియేటర్లకు విడుదల చేయగా కేవలం రూ.51 కోట్లు(50 మిలియన్ యువాన్లు)కు మించి వసూళ్లు రాలేదు. దీంతో విడుదలైన వారం రోజుల్లోనే థియేటర్లలో ప్రదర్శించడం ఆపేశారు.

చైనా పురాణ గాథ ఆధారంగా అక్కడి ప్రముఖ నటులతో, గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్టులతో ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ, అంచనాలను అందుకోలేకపోవడంతో నిర్మాతలు ఇప్పుడు దీనికి మార్పుచేర్పులు చేసి త్వరలో మళ్లీ విడుదల చేసే యోచనలో ఉన్నారు.

అప్పటికీ ఇది ప్రేక్షకులను కనుక ఆకట్టుకోలేకపోతే సినీచరిత్రలోనే భారీ ఫ్లాపుల్లో ఇదొకటిగా నిలవనుంది.

Image copyright Youtube/ASURAFILMOFFICIAL

పురాణ గాథకు కాల్పనికత జోడించిన ఈ సినిమా నిర్మాణంలో అలీబాబా పిక్చర్స్, జెంజియాన్ ఫిలిం స్టుడియో, నింగ్జియా ఫిలిం గ్రూప్ వంటి అక్కడి ప్రధాన నిర్మాణ సంస్థలు పాలుపంచుకున్నాయి.

తమ ప్రాచీన సామ్రాజ్యాన్ని దాడుల నుంచి కాపాడుకోవడానికి ఒక సామాన్య గొర్రెల కాపరి చేసిన పోరాటం కథాంశంగా దీన్ని రూపొందించారు.

సినిమా విడుదలకు ముందు చైనా మీడియా దీన్ని ఆకాశానికెత్తేసింది. కానీ, విడుదల తరువాత దీనికి అక్కడి ఫిలిం రివ్యూ పోర్టల్ దౌబాన్ దారుణమైన రేటింగ్ ఇచ్చింది.

ప్రపంచలోనే అతిపెద్దదైన అమెరికా సినీ పరిశ్రమను అధిగమించేందుకు చైనా 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్', 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వంటివాటిని తలదన్నేలా ఈ భారీ సినిమాను తలపెట్టింది.

అయితే, అనుకున్నస్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో సినిమా ప్రదర్శన నిలిపివేశామని.. మార్పులుచేర్పులతో మళ్లీ విడుదల చేస్తామని నిర్మాతలు చెప్తున్నారు.

నిజానికి హాలీవుడ్‌ సినిమాలకు ఉన్నట్లుగా చైనా సినిమాలకు ప్రపంచవ్యాప్త మార్కెట్ లేదు. కానీ, ఇటీవల కాలంలో హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి చైనా సంస్థలు సినిమాలు తీస్తున్నాయి.

'ది గ్రేట్ వాల్' వంటివి ఆ కోవలోకే వస్తాయి. అయితే, ఇది కూడా బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

లద్దాఖ్‌లో ప్రధాని మోదీ.. భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య హఠాత్ పర్యటన

తెలుగు రాష్ట్రాలకు 'ఆత్మనిర్భర్ భారత్' కింద వచ్చింది ఎంత? పేదలకు ఇచ్చింది ఎంత?

కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్

కరోనా వ్యాక్సీన్ ఎప్పుడు? భారత్ బయోటెక్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లాతో బీబీసీ ఇంటర్వ్యూ

భారత్-చైనా 5జీ స్పెక్ట్రమ్‌పై కన్నేసిన చైనా కంపెనీలను అడ్డుకోవడం ఎలా?

కాన్పూర్‌లో ఎన్‌కౌంటర్, డీఎస్పీ సహా 8 మంది పోలీసుల మృతి

వందల సంఖ్యలో ఏనుగులు అక్కడ ఎలా చనిపోతున్నాయి? ఏమిటీ మిస్టరీ?

బాలీవుడ్ డాన్స్ మాస్టర్ 'ఏక్ దో తీన్..' ఫేమ్ సరోజ్ ఖాన్ మృతి...