రోజ్ గోల్డ్: ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తున్న కొత్త రంగు

  • 28 జనవరి 2019
రోస్‌గోల్డ్ ఫ్యాషన్ Image copyright STELLA LUNARDY COUTURE

లండన్ నుంచి జకార్తా వరకు అలా ఫ్యాషన్ స్ట్రీట్‌లలో నడిచి వెళ్తుంటే రోజ్ గోల్డ్ రంగు బట్టలు ధరించిన ఒక్క వ్యక్తి అయినా మీకు కనిపిస్తారు. కనీసం రోజ్ గోల్డ్ బ్యాగునో, ఫోన్‌నో పట్టుకున్నవాళ్లయినా మీకు ఎదురవుతారు.

రోజ్ గోల్డ్ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే, ఫ్యాషన్ మొదలు కానప్పటి నుంచి ఈ రంగు వాడకం ఉంది.

మిలాన్ ఫర్నిచర్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ మార్కెట్‌ ఫెయిర్‌ను ప్రతియేటా ఏప్రిల్‌లో నిర్వహిస్తుంది. గత ఏడాది ఈ ఫెయిర్‌లో తళుక్కున్న మెరిసింది కూడా రోజ్ గోల్డ్ రంగే.

పెళ్లి వేడుకలు, కేకులు, కార్లు ..ఇప్పుడు కొత్తగా రోజ్ గోల్డ్ రంగును పులుముకుంటున్నాయి.

ఇంతకీ ఎందుకు ఈ రంగు ఇంత ప్రాధాన్యం సంతరించుకుంది?

Image copyright Getty Images

అంతా ఆపిల్ ఐఫోన్ 6ఎస్ వల్లే..

ఆపిల్ ఐఫోన్ 6ఎస్ విడుదల చేసిన సమయంలోనే ఎక్కువ మంది రోజ్ గోల్డ్ గురించి విన్నారు. అప్పటి నుంచి ఈ రంగు అందరి నోటా వినిపిస్తోంది. ఆపిల్ విడుదల చేసిన ముఖ్యమైన ఫోన్లలో ఈ రంగు ఫోన్ ఒకటి.

దీనికి ఎంత క్రేజ్ ఉందంటే.. మార్కెట్‌లోకి విడుదల కాకముందే 40 శాతం మంది ఈ రంగు ఫోన్ కోసం ఆర్డర్‌లు బుక్ చేసుకున్నారు.

సెలబ్రెటీలు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు ఏం చేసినా సామాన్యులు వారిని అనుసరిస్తుంటారు. ష్యాషన్ విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది.

అయితే, ఐఫోన్‌ను రోజ్‌ గోల్డ్ రంగు పులుముకోకముందే ఆ కలర్ ఫ్యాషన్ రంగంలో ట్రెండ్‌గా మారిందని డబ్ల్యూజీఎస్‌ఎన్ ఫ్యాషన్ ఏజెన్సీ అంటోంది.

2012లో ఆభరణాలకు ఈ రంగు వినియోగించడం మొదలైందని, అప్పటి నుంచి రోజ్ గోల్డ్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిందని పేర్కొంది.

ఫ్యాషన్ డిజైనర్లు జిమ్మీ చో, క్యావలీలు రోజ్‌ గోల్డ్ స్ఫూర్తితో ఫ్యాషన్ దుస్తులను తీసుకొచ్చారు.

ఇంటీరియర్ డిజైనర్లు దీన్ని అందిపుచ్చుకున్నారు.

ఈ కలర్ ట్రెండ్ అవుతుండటంతో దీని ప్రభావం రాగి రంగుపై పడింది. ఎందుకంటే రాగి రంగు.. రోజ్ గోల్డ్ కలర్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అంతేకాకుండా రాగి రంగును ప్రజలు ఒక లోహంగానే భావిస్తారు.

రోజ్‌గోల్డ్ కలర్ ప్రజలను బాగా ఆకర్షించింది. అందువల్ల 2016లో ఈ రంగును ప్రపంచ ప్రసిద్ధ రంగుల కంపెనీ పాంటోన్ కలర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది.

Image copyright FOX SEARCHLIGHT PICTURES

ట్రెండ్స్ ఎలా పనిచేస్తాయి?

పాంటోన్ కంపెనీ ఇచ్చే సలహాలు ఫ్యాషన్, ఫర్నిషింగ్, వెడ్డింగ్ డిజైనర్లను బాగా ప్రభావితం చేస్తుంటాయి.

యేటా పాంటోన్ ఒక కొత్త రంగును హైలెట్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైనర్లు, ఫర్నిషింగ్ నిపుణులు, వెడ్డింగ్ ఇండస్ట్రీ ఆ రంగును అనుసరిస్తుంటారు.

‘‘కొన్ని కారణాల వల్ల రోజ్‌గోల్డ్ ఎప్పటికీ ప్రసిద్ధ రంగుగానే ఉంటుంది’’ అని పెన్నీ గోల్డ్ స్టోన్ డిజిటల్ ఫ్యాషన్ ఎడిటర్ మారీ క్లేరీ తెలిపారు.

ప్రముఖ షూ కంపెనీ మిల్లెనియల్స్ తన సోషల్ మీడియా సైట్‌లలో ఎక్కువగా పింక్ రంగుతో కూడిన ఫొటోలనే పోస్టు చేస్తుంది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి.

''త్వరలోనే రోజ్‌గోల్డ్ రంగు వాడటం గొప్ప సంస్కృతిగా మారుతుందని చెప్పగలను. 2015 నుంచే ఈ రంగు పాపులర్ అవడం మొదలైంది. ఇప్పుడు ప్రజానీకాన్ని భారీగా ఆకర్షిస్తోంది'' అని ఆమె తెలిపారు.

Image copyright SEAT

ఇన్‌స్టాగ్రామ్‌ ట్రెండ్‌ ప్రభావం తమ ఉత్పత్తుల అమ్మకాలపై బాగానే కనిపిస్తుందని చాలా మంది వ్యాపారులు బీబీసీకి తెలిపారు.

సోషల్ మీడియాలో రోజ్‌గోల్డ్ రంగు ఉత్పత్తుల ట్రెండ్ కనిపిస్తుండటంతో వాటినే వినియోగదారులు అడుగుతున్నారని చెప్పారు.

''గులాబీ రంగు దుస్తులు ధరించడాన్ని ఇప్పుడు ఆమోదిస్తున్నారు. ఒకప్పుడు ఈ రంగు కేవలం మహిళా రంగు గానే పరిమితమైంది. షాపుల్లో ఒక్క పింక్ సూట్ అయినా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. గతంలో ఈ పరిస్థితి లేదు'' అని హాలీవుడ్ యాక్టర్ మాథ్యెవ్ సిమ్ అన్నారు.

Image copyright @NEWBUILDTOHOME

కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు

రోజ్‌గోల్డ్ ట్రెండ్ అనేది ప్రస్తుతం శిఖర స్థాయికి చేరుకుందని డబ్ల్యూజీఎన్ సంస్థ పేర్కొంది. వివిధ వస్తువుల అమ్మకాలపై ఈ రంగు ప్రభావం కచ్చితంగా ఉంటుందని పలు కంపెనీలు చెబుతున్నాయి.

ఈ ఫ్యాషన్ తగ్గుతుందా?

‘‘ఇంటిని అలంకరించడం కూడా ఫ్యాషన్‌లాంటిది. ఇందులో కూడా కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. అయితే, కొంతమందికి ఈ రోజ్‌గోల్డ్ ఎప్పటికీ నచ్చుతుందని అనుకుంటా. ఈ రోజ్‌గోల్డ్ ట్రెండ్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం అయితే లేదని అనుకుంటున్నా’’ అని ఫ్యాషన్ డిజైనర్ స్నూక్ తెలిపారు.

Image copyright MELISSA

ఒక వస్తువుకు కొత్త లుక్ తీసుకురావడం అంటే దాని రంగులో కూడా మార్పు చేయడమే. ఈ విషయాన్ని ప్రముఖ షూ కంపెనీ మిలెసా అంగీకరిస్తోంది.

‘‘ప్రపంచవ్యాప్తంగా మాకున్న 270 షాపుల్లోని అమ్మకాలను పరిశీలిస్తే ఎక్కువగా అమ్ముడుపోయినవి రోజ్ గోల్డ్ రంగులో ఉన్నవేనని మాకు తెలిసింది’’ అని మిలెసా ప్రతినిధులు బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు