రాణి గారి హంసలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

బ్రిటన్: హంసల ఆలనాపాలనా చూసుకుంటున్న రాణి

  • 24 జూలై 2018

బ్రిటన్‌లో ఎవరూ పట్టించుకోని హంసల ఆలనాపాలనా రాణి చూసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వాటి బాగోగులను రాణి ఎలా చూసుకుంటారు? వాటి సంఖ్యను ఎలా తెలుసుకుంటారు? అందుకే ప్రతి ఏడాది 'స్వాన్ అప్పింగ్' అనే వేడుక నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూడండి.

బ్రిటన్‌లో నదులు, సరస్సుల్లో ఉండే హంసలు.. చట్ట ప్రకారం రాణికే చెందుతాయి. కానీ ప్రస్తుతం ఆమె థేమ్స్ నదిలోని హంసల బాగోగులు మాత్రమే చూసుకుంటున్నారు.

రాణి తరుపున తెల్లని ఈక గల టోపీ పెట్టుకుని, ఎర్రని యూనిఫాం వేసుకునే స్వాన్ మార్కర్లు దాదాపు 900 ఏళ్లుగా హంసల సంరక్షణ పనులు నిర్వహిస్తున్నారు.

అయిదు రోజుల పాటు జరిగే ఈ స్వాన్ అప్పింగ్ కార్యక్రమంలో భాగంగా థేమ్స్ నదిలో లండన్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆక్స్‌ఫర్డ్ వరకు ఈ స్వాన్ మార్కర్ బృందం సంచరిస్తుంది.

హంసలు, వాటి పిల్లలను లెక్కించండం.. బరువును తూచి, ఆరోగ్యాన్ని పరిశీలించి, ట్యాగ్ వేయటం వీరి పని.

900 ఏళ్ల కిందట ఈ కార్యక్రమ ఉద్దేశానికి నేటికీ చాలా తేడా ఉంది.

ఆ రోజుల్లో హంసలు ప్రధాన ఆహారంగా ఉండేవి. అత్యంత సంపన్నుల భోజనంలో ఇవి ఒక భాగం. నేడు జరిగే కార్యక్రమం హంసలను రక్షించడానికి, వాటిపై అవగాహన కల్పించడానికి.

ప్రతి ఏడాది ఇక్కడ లెక్కించే హంసల సంఖ్య దాదాపు వెయ్యి ఉంటుంది. ఈ హంసలు పెద్దవి, బలమైనవి.

అయినా వీటిని ఎలా మచ్చిక చేసుకోవాలో వీరికి బాగా తెలుసు. ఇందుకోసం వారు తగిన శిక్షణ పొందుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)