భగవాన్ రజనీష్
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

28 ఏళ్ళ తరువాత ప్రత్యక్షమైన ఓషో సన్నిహితురాలు ఆనంద్ షీలా

  • 23 జూలై 2018

ఓషోగా సుపరిచితులైన రజనీష్ భారత్‌ నుంచి అమెరికాలోని ఓరెగాన్‌కు వెళ్లి అక్కడ వేలాది మంది భక్తులను సంపాదించుకున్నారు.

ఈ వివాదాస్పద బోధకుడికి 15వేల మంది భక్తులు తమ ఆస్తులు అమ్మేసి మరీ ఒక నగరాన్ని ఎలా నిర్మించారో నెట్‌ఫ్లిక్స్‌ 'వైల్డ్ వైల్డ్ కంట్రీ' అనే సిరీస్‌లో వివరంగా చూపించారు.

ఓషో వెన్నంటే ఉన్న ప్రధాన వ్యక్తి ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన 'మా ఆనంద్ షీలా'. 28 ఏళ్ళ తర్వాత ఆనంద్ షీలా తన వివాదాస్పద గతాన్ని విడిచిపెట్టేసి స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం రెండు సంరక్షక కేంద్రాలను నడుపుతున్నారు.

ఓరెగాన్‌లోని యాంటెలోప్ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో సుమారు 750 మంది తినే ఆహారంలో విషం కలిపినట్టు షీలాపై ఆరోపణలున్నాయి. మనుషుల ప్రాణాలకు హాని తలపెట్టారన్న నేరం మీద 20 ఏళ్ళు, ఇమ్మిగ్రేషన్‌ మోసాలకు పాల్పడ్డారని మరో నాలుగేళ్ళు ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించింది.

బీబీసీ ప్రతినిధి ఇష్లీన్ కౌర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. రజనీష్‌తో తన సంబంధాల గురించి, విషప్రయోగం ఆరోపణల గురించి వివరణ ఇచ్చారు. ఆ వివరాలు పై వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు