వచ్చేస్తోంది.. మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో

  • 24 జూలై 2018
నికోల్ మైన్స్ Image copyright Getty Images

ఇప్పటివరకూ మనకు సూపర్ హీరోలు, సూపర్ హీరోయిన్లే తెలుసు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక నటి ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో పాత్ర చేసేందుకు సిద్ధమైంది. సూపర్ గర్ల్ అనే లైవ్ యాక్షన్ టీవీ సిరీస్ మొదటిసారి ట్రాన్స్ జెండర్ సూపర్ హీరోను చూపించబోతోంది.

నటి, ఉద్యమకారిణి నికోల్ మైనెస్ ఒక ట్రాన్స్‌జెండర్. ఆమె ఇప్పుడు సూపర్ గర్ల్ సిరీస్‌లో 'నియా నల్' అనే తన కలల పాత్ర చేయబోతోంది.

"ఈ పాత్రతో ట్రాన్స్‌జెండర్ పిల్లల కోసం కూడా ఒక ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరో ఉంటాడు" అని ఆమె కాలిఫోర్నియా శాన్‌డియోగోలో జరిగిన కామిక్ కాన్‌లో ప్రకటించింది.

త్వరలో రాబోతున్న సూపర్ గర్ల్ ఫోర్త్ సీజన్‌లో మైనెస్ చేస్తున్న నియా నల్ పాత్రను పరిచయం చేయబోతున్నారు.

సూపర్ గర్ల్ సిరీస్‌లో ఇతరులను కాపాడే ట్రాన్స్‌జెండర్ యువతిగా ఈమె పాత్రను వర్ణిస్తున్నారు.

వెరైటీతో మాట్లాడిన నికోల్ మైన్స్ "అభిమానులు ట్రాన్స్‌జెండర్ల గురించి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. మనం ఎవరైనా కావచ్చు, మనం ఏది కావాలంటే అది చేయచ్చు. మనం సూపర్ హీరోస్ కావచ్చు. ఎందుకంటే మనం చాలా విధాలుగా ఉంటాం" అన్నారు.

సూపర్ మెన్ సోదరి, క్రిప్టన్ వాసుల్లో మిగిలిన ఒకరుగా మెలిస్సా బెనోయిస్ట్ సూపర్ గర్ల్ పాత్ర పోషిస్తున్నారు.

ఇందులో నిలా నల్ అనే కొత్త కారెక్టర్ కాక్టో వరల్డ్ వైడ్ మెడియా ఉద్యోగిగా పరిచయం అవుతుంది.

ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్ర కథలో వారి చుట్టూ తిరిగేలా ఉండదని ప్రేక్షకులు తెలుసుకోవాలని నికోల్ మెయిన్స్ చెప్పారు.

Image copyright Getty Images

ట్రాన్స్‌జెండర్ సూపర్ హీరోగానే కాకుండా నియా ఇంకా చాలా పనులు చేస్తుంది. ఆమె ఒక రిపోర్టర్, తను చాలా బలమైనది, చాలా తెలివైనది, మంచి స్నేహితురాలు కూడా.

2014లో స్కూల్ గర్ల్స్ టాయిలెట్ ఉపయోగించడానికి అనుమతించలేదని నికోల్ మెయిన్స్, ఆమె కుటుంబం కోర్టుకు వెళ్లింది.

దాంతో ఆ స్కూల్ దేశ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆగ్రహించింది.

నటనా కెరీర్ ప్రారంభించిన నికోల్, రాయల్ పెయిన్స్ అనే అమెరికా కార్యక్రమంలో నటనకు 2016 గ్లాడ్ అవార్డు గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)