ఇది మామూలు గొరిల్లా కాదు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

BBC Archive: ఇది మామూలు గొరిల్లా కాదు

  • 24 జూలై 2018

కోకో- ఇది మామూలు గొరిల్లా కాదు. మనం ఇచ్చే వెయ్యికి పైగా సంకేతాలను అర్థం చేసుకోగలదు. గత నెలలో కాలిఫోర్నియాలో చనిపోయే నాటికి దాని వయసు 46 ఏళ్లు. ఇది 1985లో బిబిసి తనను కలిసినప్పటి కథనం. ఈ గొరిల్లాకు ఒక పిల్లి కూన కూడా నేస్తంగా ఉండేది. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా?

చేతితో ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడంలో తనకు తానే సాటి. అలానే ఇతర జాతి ప్రాణుల సంరక్షణ కూడా బాగా తెలుసు. తన తెలివి, మృదు స్వభావంతో లక్షలాది మంది హృదయాలలో చోటు సంపాదించుకుంది.

ఇక్కడ కోకో ఒక పిల్లికూనతో ఆడుకోవడం మనం చూస్తున్నాం. ఆ పిల్లిని దత్తత తీసుకుంది కోకో. అంతే కాదు. ఈ పిల్లి పిల్లకు ఓ పేరు కూడా పెట్టింది. ఆ పేరేంటో తెలుసా? లిప్ స్టిక్. ఈ పేరు పెట్టడానికి కారణం, పిల్లి పెదాలు పింక్‌గా ఉండటమే. కోకో తన జీవితంలో ఇలాంటి చాలా ప్రాణులను చేరదీసింది. వాటిలో ముఖ్యమైనవి పిల్లులు.

అయితే కోకో ప్రఖ్యాతి గడించడానికి ఇదొక్కటే కారణం కాదు. అమెరికాలో అభివృద్ది చేసిన కమ్యునికేషన్ పద్దతినీ, చేతితో చేసే సంకేతాలను చాలా బాగా అర్థం చేసుకుంటుంది కోకో. అచ్చంగా మనుషులు ఎలా భాషను ఉపయోగిస్తారో కోకో కూడా అదే విధంగా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

ఈ సైగలనే కాకుండా దాదాపు రెండు వేలకు పైగా ఇంగ్లీషు భాషా పదాలను కూడా కోకో అర్థం చేసుకోగలదు. మనిషి వలె దీని ఐక్యూ కూడా 70 నుంచి 90 మధ్యలో ఉంటుంది.

అయితే బాధ కల్గించే విషయమేంటంటే, కోకో ఇటీవలే - జూన్ 19న కన్ను మూసింది. ప్రశాంతంగా పడుకున్న కోకో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఎన్నటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్ని కోకో వదిలి వెళ్లిందని The Gorilla Foundation చెప్తుంది. గొరిల్లాల్లోని భావావేశాల స్థాయిని, దాని మేధో శక్తిని అర్థం చేసుకోగలిగాం అని కూడా వారంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు