ఈ లక్షణాలు కనిపిస్తే, అది మధుమేహం కావొచ్చు... జాగ్రత్త!

  • 24 జూలై 2018
మధుమేహం ఉన్న మహళ Image copyright Getty Images

నాకు షుగర్ ఉందా? ఈ ప్రశ్న వృద్ధులనే కాదు.. యువతను కూడా వేధిస్తోంది. గడిచిన 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది.

డయాబెటిస్ రెండు రకాలు.. టైప్ -1, టైప్ -2 డయాబెటిస్. వీటిలో సాధారణంగా 'టైప్-1' డయాబెటిస్‌ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. వీరు ఇన్సులిన్‌ను వాడాల్సి ఉంటుంది.

టైప్ -2 డయాబెటిస్ అసహజ జీవన శైలి, వంశపారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు.

ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నపుడు, లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సివచ్చినపుడు చాలామందిలో మధుమేహం బయటపడుతుంది.

‘‘నాకు చివరి కాన్పు అయిన సంవత్సరం తర్వాత షుగర్ బయటపడింది. సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగా రక్తపరీక్షలు చేశారు. అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి’’ అని మధుమేహ బాధితురాలు మంజుల డెయిలీ అన్నారు.

డయాబెటిస్‌ను ఎలా గుర్తించాలో ఈ వీడియోలో చూడండి

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమీకు షుగర్ ఉందా?

టైప్-2 డయాబెటిస్‌ బయటపడటానికి పదేళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటిస్‌ను గుర్తించొచ్చు. తరచూ దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివి డయాబెటిస్ లక్షణాలు.

‘‘చక్కెర వల్ల మధుమేహం వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. చక్కెర వ్యాధికి, చక్కెరకు ప్రత్యక్ష సంబంధం ఏదీ లేదు. చక్కెర ఎక్కువగా తీసకుంటే శరీరం బరువు పెరుగుతుంది. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది’’ అని కేర్ డయాబెటిస్‌కు చెందిన డాన్ హోవర్త్ అన్నారు.

‘‘అవసరానికి మించి షుగర్ తీసుకుంటే, నా షుగర్ స్థాయి కూడా పెరుగుతుంది. షుగర్ ఎక్కువగా ఉన్నపుడు తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, అలసట, నీరసం.. లాంటి లక్షణాలు నాలో కనిపించేవి. క్రమం తప్పని రక్త పరీక్షలు, ఆరోగ్యవంతమైన ఆహారం ద్వారా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు’’ అని మంజుల అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)