పాకిస్తాన్ ఎన్నికలు: మహిళా ఓటర్లు ఎక్కడ? పోలింగ్ స్టేషన్లకు రప్పించటానికి చేపడుతున్న చర్యలు ఏమిటి?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

పాకిస్తాన్ ఎన్నికలు: ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 10 శాతం మహిళల ఓట్లు తప్పనిసరి. లేదంటే..

  • 25 జూలై 2018

పాకిస్తాన్ ఆవిర్భవించినప్పటి నుంచీ ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు ఉంది. కానీ ఓటు వేసే పురుషులు, మహిళల సంఖ్యలో ఇప్పటికీ భారీ వ్యత్యాసముంది.

దేశంలోని సంప్రదాయవాద ప్రాంతాల్లో మహిళలను పోలింగ్ స్టేషన్లకు పంపించటానికి నిరాకరించే సంప్రదాయాన్ని బద్దలు కొట్టటానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

జూలై 25న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి నియోజవర్గంలోనూ కనీసం 10 శాతం మహిళా ఓటర్ల ఓట్లు ఉండాలన్నది తప్పనిసరి అని నిర్దేశించారు.

అలా లేని నియోజకవర్గంలో ఓటింగ్ చెల్లదని ప్రకటించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)