ఈ మహిళ ప్రపంచాన్ని చుట్టేశారు

  • 29 జూలై 2018
వెండీ టక్, క్లిప్పర్ రేస్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక వెండీ టక్

ఆస్ట్రేలియాకు చెందిన వెండీ టక్.. ప్రతిష్టాత్మక క్లిప్పర్ రేస్‌లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళగా అవతరించారు.

2017-18 క్లిప్పర్ రేస్‌లో వెండీ టక్ తన టీమ్‌తో కలిసి పడవలో లివర్‌పూల్ చేరుకున్నపుడు వేలాది మంది ఆమె బృందానికి ఆహ్వానం పలికారు.

గత ఆగస్టులో బ్రిటన్‌లోని లివర్‌పూల్ నుంచి మొత్తం 12 పడవలు ప్రపంచం చుట్టిరావడానికి బయలుదేరినపుడు సుమారు 2 లక్షల మంది వాటికి వీడ్కోలు పలికారు.

బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల నిక్కీ హేండర్సన్ టీమ్‌ ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.

పోటీలో విజయం సాధించిన 53 ఏళ్ల టక్ - ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నానని అన్నారు.

Image copyright PA
చిత్రం శీర్షిక 11 నెలల తర్వాత లివర్‌పూల్‌కు తిరిగి వచ్చిన నౌక

ఈ పోటీలలో మొత్తం 41 దేశాలకు చెందిన నావికులు పాల్గొన్నారు.

మహిళలు కెప్టెన్‌లుగా వ్యవహరించే ఇలాంటి పోటీలు గతంలో ఎప్పుడూ జరగలేదని 1996లో ఈ పోటీలను ప్రారంభించిన, ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టివచ్చిన నావికుడు సర్ రాబిన్ నాక్స్-జాన్‌స్టన్ అన్నారు.

రెండోస్థానం వచ్చిన టీమ్‌‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హెండర్సన్ బ్రిటన్‌ ఎంపీ ఆన్నే మిల్టన్ కూతురు.

హెండర్సన్ టీమ్‌లో పాల్గొన్న నాటింగ్ హామ్ షైర్ అగ్నిమాపక దళానికి చెందిన రెబెక్కా సిమ్స్, ఇది క్రీడల్లో పాల్గొనే మహిళలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు.

ఈ పోటీలలో పాల్గొన్న బ్రిస్టల్ నావికుడు సైమన్ స్పియర్స్ ఈదురుగాలుల కారణంగా సముద్రంలో పడి మరణించారు. దీనిపై విచారణ జరుగుతోంది.

Image copyright Clipper Race/PA
చిత్రం శీర్షిక గత ఏడాది పోటీ ప్రారంభం సందర్భంగా సర్ రాబిన్ నాక్స్-జాన్‌స్టన్‌తో నావికులు

క్లిప్పర్ రేస్ పోటీ మొత్తం 8 అంచెలుగా ఉంటుంది. ఒకే రకంగా ఉండే క్లిప్పర్ 70 అనే ప్రత్యేకంగా డిజైన్ చేసిన పడవలతో పోటీలు నిర్వహిస్తారు.

వీటిలో పాల్గొనే నావికులంతా అనుభవం లేని వారే. వారికి అనుభవం కలిగిన వాళ్లు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు.

1996లో ప్రారంభమైన ఈ పోటీలలో మొత్తం 40 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం పూర్తి చేయాలి.

Image copyright Derry City & Strabane District Council
చిత్రం శీర్షిక నౌకలు లివర్‌పూల్‌ను చేరుకోవడంతో అంబరాన్ని అంటిన సంబరాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.