మహిళా కాటికాపరి ఎక్కడున్నారో తెలుసా?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

'నువ్వు ఆడ పిల్లవి.. ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు కానీ 4వేల మందికి దహన సంస్కారాలు నిర్వహించారు

  • 31 జూలై 2018

దేశంలో చాలా చోట్ల, చాలా సముదాయాల్లో మహిళలు శ్మశానం వద్దకే వెళ్లరు. అలాంటిది అందులో కాటికాపరిగా పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. శవం పూర్తిగా కాలిపోయేదాకా పక్కనే నిలబడాలంటే చాలా తెగువ కావాలి. అనకాపల్లికి చెందిన జయలక్ష్మి ఆ పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాటికాపరిగా పని చేస్తున్న ఏకైక మహిళ ఆమె. ఇప్పటి వరకు ఆమె నాలుగు వేలకు పైగా శవాలకు దహన ప్రక్రియ పూర్తి చేశారు. మహిళలలో ఏ పనినైనా నిర్వహించగల ధైర్యం ఉంటుందని అంటున్నారు జయలక్ష్మి. బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని అందిస్తున్న కథనం. ఈ వీడియోలో..

ఇవి కూడా చదండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)