అమీనా: ఈ ఆఫ్రికా రాణి ప్రతి యుద్ధం తరువాత ఓ భర్తను పొందుతారు తర్వాత..
అమీనా ఆఫ్రికా చరిత్రలో ఎందుకు నిలిచిపోయారో తెలియాలంటే ఈ వీడియో చూడండి
అమీనా... ప్రపంచాన్ని మార్చిన ఓ ఆఫ్రికన్ మహారాణిగానే ప్రజలకు తెలుసు. కానీ స్థానికులు ఆమెలోని మరో కోణం గురించి కూడా చెబుతారు. ప్రతి యుద్ధం తరువాత ఆమె ఓ భర్తను పొందుతారు. ఆ రాత్రి అతడితో గడిపిన అనంతరం, మరుసటి రోజున ఆ భర్తను చంపించేసేదనీ అంటారు.
1533లో ప్రస్తుత నైజీరియాలోని జజావు ప్రావిన్స్‌లో అమీనా పుట్టారు. ఆమెది చాలా సంపన్న కుటుంబం. తండ్రి వ్యాపారాలు చేస్తూనే రాజ్యాన్నీ పాలించేవాడు.
అమీనా తండ్రి చనిపోయాక, సోదరుడు కరామా సింహాసనాన్ని దక్కించుకున్నాడు. కానీ, అమీనా కూడా తక్కువ తినలేదు. ఆమె కూడా కత్తి పట్టారు. యుద్ధ విద్యలో ఆరితేరారు. దాంతో పురుషాధిక్య జజావు సైన్యంలో ఆమె గౌరవం పెరిగింది.

సోదరుడు చనిపోయాక, జజావు రాజ్యానికి అమీనా తొలి మహారాణిగా మారారు. అధికారం దక్కిన కొన్ని రోజులకే ఆమె దండయాత్రలు మొదలయ్యాయి. ఒక్కో రాజ్యాన్నీ చేజిక్కించుకుంటూ తన పాలనను విస్తరించారు. 20వేల సైనికులను తన అధీనంలోకి తెచ్చుకున్నారు.
ప్రస్తుతం నైజీరియా ప్రజలు ఆమెను శక్తిమంతమైన మహిళగా కీర్తిస్తున్నారు. స్త్రీలలోని సామర్థ్యానికి అమీనాను ఓ ఉదాహరణగా చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)