సూర్యుడి సమీపంలోకి మానవ అస్త్రం.. పార్కర్ సోలార్ ప్రోబ్

సూర్యుడి సమీపంలోకి మానవ అస్త్రం.. పార్కర్ సోలార్ ప్రోబ్

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్‌ను ప్రారంభించింది. సూర్యుని బాహ్యవలయ ప్రాంతంలోకి.. అంటే సూర్యుని చుట్టూ ఉండే కరోనా భాగంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ అనే శాటిలైట్‌ను పంపింది. సూర్యుని విషయంలో ఉన్న అనేక సందేహాలు, రహస్యాలను ఈ స్పేస్ క్రాఫ్ట్ చేధించగలదని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

పార్కర్ సోలార్ ప్రోబ్ మనల్ని సూర్యుడికి చాలా దగ్గరకు చేరుస్తుందని శాస్ర్తవేత్తలు చెప్పారు.

మానవాళి ఇప్పటి వరకు నిర్మించిన వాటిలో అత్యంత వేగంగా ప్రయాణించే వాహనమిది. గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

సోలార్ ప్రోబ్ సూర్యుని చుట్టూ ఉన్న ఒక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. వచ్చే ఏడేళ్లలో సూర్యుడికి సమీపంగా వెళుతుంది. ఇది సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లినపుడు.. సూర్యడి ఉపరితలానికి, సోలార్ ప్రోబ్‌కు మధ్య దూరం సుమారు నలభై లక్షల మైళ్లు ఉంటుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)