లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది

  • 19 ఆగస్టు 2018
టర్కీ, భారత నాణేలు Image copyright Getty Images

అమెరికన్ డాలర్‌తో పోల్చితే భారత కరెన్సీ రూపాయి విలువ చరిత్రలో అత్యంత తక్కువ స్థాయికి చేరింది. ఇప్పుడు డాలర్ విలువ రూ.70కి అటు ఇటుగా ఉంది.

టర్కీ కరెన్సీ లిరా సంక్షోభం రూపాయి పతనానికీ ఓ కారణమైందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

టర్కీలో పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో లిరా అత్యంత కనిష్ఠ స్థాయికి చేరింది. కంపెనీలు బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడం.. అమెరికాతో సంబంధాలు క్షీణిస్తుండటం, టర్కీ ఉక్కు, అల్యూమినియంపై అమెరికా ధరలు పెంచడం వంటి కారణాలు లిరా పతనానికి దారి తీశాయి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది ఎలాగో ఈ వీడియోలో చూడండి

లిరా పతనం ప్రభావంతో పెట్టుబడిదారులు రూపాయికన్నా డాలర్ వంటి సురక్షితమైన కరెన్సీవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ వంటి దేశాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతున్నాయి.

''ఇదే పరిస్థితి కొనసాగుతుందని అనుకోవడం లేదు. ఒకవేళ కొనసాగితే నియంత్రించడానికి ఆర్బీఐకి తగిన సాధనాలు ఉన్నాయి. తగిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది'' అని ఆర్థిక నిపుణుడు వివేక్ కుమార్ అన్నారు.

ఇప్పుడు లిరా సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో భారత కరెన్సీ కూడా కొన్నాళ్లు బలహీనంగానే ఉండొచ్చు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు