వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?

  • 20 ఆగస్టు 2018

దేశంలో తారాజువ్వలా దూసుకుపోతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వెనెజ్వేలా అధ్యక్షుడు నికోలస్ మడూరో.. చిన్న మొత్తాల్లో ఉన్న కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. వెనెజ్వేలాలో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 10,00,000 శాతం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది.

వెనెజ్వేలాలో తలెత్తిన తీవ్ర ఆర్థిక తిరోగమనం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ.. బొలీవర్‌కు విలువ లేకుండా పోయింది. దేశంలో ద్రవ్యోల్బణ తీవ్రతను తెలియజేసేందుకు రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ కార్లోస్ గార్సియా రవ్లిన్స్ ప్రయత్నించారు. ఇళ్లలో ప్రతిరోజూ వినియోగించే నిత్యావసరాలు.. వాటిని కొనుగోలు చేసేందుకు అవసరమయ్యే డబ్బు కట్టలను పక్కపక్కనే పెట్టి ఫొటోలు తీశారు.

రాజధాని నగరం కరాకస్‌లో 2.4 కేజీల బరువున్న చికెన్ కొనాలంటే 1,46,00,000 బొలీవర్‌లు కావాలి. (సుమారు 4,107 రూపాయలు)

చికెన్ కొనాలంటే 14,600,000 బొలీవర్‌లు కావాలి Image copyright Reuters

గత గురువారం టాయిలెట్ పేపర్ 26,00,000 బొలీవర్‌లు పలికింది.

టాయిలెట్ పేపర్ 2,600,000 బొలీవర్‌లు Image copyright Reuters

ఈ క్యారెట్లను కొనాలంటే 30 లక్షల బొలీవర్‌లు కావాలి.

క్యారెట్లను కొనాలంటే 30 లక్షల బొలీవర్‌లు కావాలి Image copyright Reuters

అధ్యక్షుడు తీసుకున్న చర్యలు సోమవారం అమల్లోకి రాకముందే తమ ఇళ్లలోకి అవసరమైన, వీలైనన్ని ఆహార పదార్థాలు కొనిపెట్టుకోవాలని ప్రజలంతా భావించారు. ఎందుకంటే కొత్త చర్యల కారణంగా అపోహలు తలెత్తి, బ్యాంకులపై ఒత్తిడి పెరిగి, క్రయవిక్రయాలు సరిగ్గా జరగవేమోనన్నది వారి భయం.

కేజీ బియ్యం ధర 25,00,000 బొలీవర్‌లు.

కేజీ బియ్యం ధర 2,500,000 బొలీవర్‌లు Image copyright Reuters

ఈ ఏడాది జులైలో ద్రవ్యోల్బణం 82,700 శాతానికి చేరింది.

మరకైబో నగరంలోని ఒక సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన అలీసియా రమిరెజ్ (38) అనే ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేటర్‌.. రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘కూరగాయలు కొందామనుకున్నా. కానీ ఈ క్యూలైనులో నిలబడలేక వెళ్లిపోతున్నా. ప్రజలకు పిచ్చెక్కుతోంది’’ అన్నారు.

Presentational grey line
Presentational grey line

శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్ కొనాలంటే 35,00,000 బొలీవర్‌లు అవసరం.

శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్ కొనాలంటే 3,500,000 బొలీవర్‌లు అవసరం Image copyright Reuters

కిలో టొమాటోలు ఎంత? 50,00,000 బొలీవర్లు మాత్రమే!!

కిలో టొమాటోలు 5,000,000 బొలీవర్లు Image copyright Reuters

సోమవారం దేశవ్యాప్తంగా చిన్న మొత్తాల్లో ఉన్న కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. కొన్ని గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా నిలిచిపోతాయి.

కిలో వెన్న, దానిని కొనుగోలు చేయటానికి అవసరమైన 7,500,000 బొలీవర్ల కట్టలు Image copyright Reuters

కిలో వెన్న, దానిని కొనుగోలు చేయటానికి అవసరమైన 75,00,000 బొలీవర్ల కట్టలను ఈ ఫొటోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం