‘మద్యపానం.. మితంగా తాగినా ముప్పే’

  • 26 ఆగస్టు 2018
మద్యపానం, ఆరోగ్యం Image copyright Getty Images

రోజూ ఒక గ్లాసు వైన్ పుచ్చుకుంటే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతున్న వాళ్లకు ఇప్పుడొక ఒక బ్యాడ్ న్యూస్.

మద్యం ఎంత పరిమాణంలో సేవించినా, అది ఆరోగ్యానికి మంచిది కాదని లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది.

కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభించవచ్చేమో కానీ.. మద్యపానం వల్ల కేన్సర్, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో వెల్లడైంది.

తక్కువ మోతాదులో మద్యం సేవించడం ఎంత ప్రమాదం?

1990 నుంచి 2016 మధ్యకాలంలో మొత్తం 195 దేశాలకు చెందిన 15 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న వారిని వీరు పరిశీలించారు. ఈ పరిశోధనలో అసలు మద్యం సేవించని వారిని, రోజుకు ఒకసారికి మించి మద్యం సేవించే వారితో పోల్చి చూశారు.

Image copyright Getty Images

ఒక లక్ష మంది మద్యం సేవించని వారిని పరిశీలిస్తే వారిలో 914 మందికి మద్యంతో ముడిపడిన కేన్సర్ లాంటి వ్యాధులు వచ్చాయని వెల్లడైంది.

అదే రోజూ ఆల్కహాల్ ఉన్న ఒక డ్రింక్ సేవించే వారిని పరిశీలించినపుడు వారి సంఖ్య 918.

అదే రోజూ రెండు డ్రింక్‌లు తీసుకునే వారిని పరిశీలించినపుడు ఒక ఏడాది సమయంలో ఈ సంఖ్యకు మరో 63 మంది జతచేరారు.

రోజూ 5 డ్రింక్‌లు తీసుకునే వారిని పరిశీలించగా, ఆ సంఖ్య మరో 338 పెరిగింది.

ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో ఒకరైన లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ సోనియా సక్సేనా, ''రోజుకు ఒక డ్రింక్ వల్ల ఆ వ్యక్తికి జరిగే హాని చిన్నదే కావచ్చు. అయితే బ్రిటన్ జనాభాలో చాలా మంది ఒక్క డ్రింక్‌తో సరిపుచ్చుకోవడం లేదు. అందువల్ల సమస్య కనిపించేంత చిన్నది కాదు'' అన్నారు.

మద్యం సేవించే వారు దాని వల్ల కలిగే ప్రమాదాలను గురించి తెలుసుకోవడం మంచిదని ఆమె సూచించారు.

Image copyright SolStock

పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన డాక్టర్ మ్యాక్స్ గ్రిస్వాల్డ్, ''మద్యం సేవించడం వల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని గతంలో నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. కానీ మా పరిశోధనల్లో దాని వల్ల వచ్చే లాభనష్టాలను పోల్చి చూశాం. మద్యం సేవించడం వల్ల నష్టాలతో పోలిస్తే, లాభాలు చాలా తక్కువ అని ఇందులో తేలింది. మద్యం ఎంత ఎక్కువ సేవిస్తే, వాటి వల్ల వ్యాధులు వచ్చే రిస్క్ అంత ఎక్కువ'' అని తెలిపారు.

బ్రిటన్ మహిళలు సగటున రోజుకు మూడు డ్రింకులు తాగుతారని ఈ పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా చూసినపుడు బ్రిటన్ మహిళలు మద్యం సేవించడంలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఉక్రెయిన్ మహిళలు మొదటి స్థానంలో ఉన్నారు.

అయితే బ్రిటన్ పురుషులు మాత్రం మద్యం సేవించడంలో 62వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రొమేనియా పురుషులు రోజుకు సగటున రోజుకు 8 డ్రింకులు తాగుతున్నారని వెల్లడైంది.

ఈ పరిశోధనలో 10 గ్రాముల ఆల్కహాల్‌ను ఒక డ్రింకుగా పరిగణించారు. అదే బ్రిటన్‌లో 8 గ్రాములను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

మొత్తం ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినపుడు ప్రతి ముగ్గురిలో ఒకరు మద్యం సేవిస్తున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది. అలాగే 15-49 ఏళ్ల మధ్య సంభవించే మరణాల్లో పదో వంతు మరణాలు మద్యం వల్లనే సంభవిస్తున్నాయని గుర్తించారు.

ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...

మిడతల దండు: పోరాటానికి మరిన్ని నిధులు కావాలన్న ఐరాస

బాలాకోట్ దాడులు: మసూద్ అజర్ నియంత్రణలోని ఆ మదరసా వద్దకు నేటికీ ఎవరినీ అనుమతించరు

దిల్లీ హింస: 'ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్ళి చేసుకున్నాడు... 11 రోజులకే అల్లర్లలో చనిపోయాడు"

కరోనావైరస్ ఎఫెక్ట్: పడిపోతున్న బీర్ల అమ్మకాలు... డెటాల్‌కు పెరుగుతున్న గిరాకీ

CAA, దిల్లీ హింసలపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి

కరోనావైరస్ వ్యాప్తిని ఉత్తర కొరియా సమర్థంగా ఎదుర్కోగలదా

కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచమంతటా కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం

దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు... పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్