స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: లైంగిక అవగాహన ఏ వయసులో వస్తుంది?

  • 9 సెప్టెంబర్ 2018
లైంగికత తెలుస్తుందా? Image copyright Getty Images

ఒక తొమ్మిదేళ్ల పిల్లాడికి తన లైంగికత గురించి తెలుస్తుందా?

ఇలాంటి ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పటివరకూ లభించలేదు. బీబీసీ ఇటీవల జామెల్ మైల్స్ అనే ఒక పిల్లాడి కథనం ప్రచురించింది. కోలరాడా, డెన్వర్‌లోని తన స్కూల్లో జామెల్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం అతడు 'గే' కావడమే అని వెల్లడైంది.

జామెల్ తల్లి లియా రోషల్ పియర్స్ ఈ వివరాలు చెప్పారు. జామెల్ తను గే అనే విషయాన్ని కొన్ని వారాల క్రితమే తనకు చెప్పాడని, అందుకు గర్విస్తున్నానని తనతో అన్నాడని ఆమె తెలిపారు.

ఈ వార్త చదివిన చాలా మంది మనసులో ఒక ప్రశ్న రావచ్చు. ఒక చిన్న పిల్లాడికి తన లైంగికత గురించి ఎలా తెలుస్తుంది? అని.

తర్వాత బీబీసీ ఈ విషయం గురించి ఇద్దరు సైకాలజిస్టులతో మాట్లాడింది. జటిలమైన ఈ విషయం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని భావించింది.

ఈ సైకాలజిస్టులు ఇద్దరూ స్పెషలిస్టులు. వీరిలో ఒకరు జెండర్ స్టడీ స్పెషలిస్ట్, సోషల్ సైకాలజీలో పీహెచ్‌డీ చేసిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫ్లోరిడా(అమెరికా) సైకాలజీ ప్రొఫెసర్ ఎషియా ఎటన్, ఇంకొకరు అమెరికా సైకాలజీ యూనియన్ ఎల్జీబీటీ కేసుల డైరెక్టర్ క్లింటన్ డబ్ల్యు అండర్సన్.

Image copyright LEIA ROCHELLE PIERCE
చిత్రం శీర్షిక కొడుకు జామెల్ మైల్స్‌తో తల్లి లియా రోషల్ పియర్స్

సెక్సువల్ ఓరియంటేషన్ సగటు వయసు ఎంత?

ఒక వ్యక్తికి ఏ వయసులో లైంగిక అవగాహన లేదా సెక్సువల్ ఓరియంటేషన్ వస్తుంది? దీని గురించి ఏవైనా పరిశోధనలు జరిగాయా? నిపుణులు దీనిపై ఏమంటున్నారు?

"కొన్ని పరిశోధనల ప్రకారం 8 నుంచి 9 ఏళ్ల వయసులోనే పిల్లలకు మొదటిసారి లైంగిక ఆకర్షణ కలుగుతుంది. మిగతా పరిశోధనలను చూస్తే అలా 11 ఏళ్లకు దగ్గరలో జరుగుతుందని తేలింది. ఈ పరిశోధనల్లో సెక్సువల్ ఓరియెంటేషన్ సగటు వయసు గుర్తించడంలో రకరకాల ఫలితాలు వచ్చాయి" అన్నారు ఎషియా ఎటన్.

"ఇది ఒక క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే సెక్సువల్ బిహేవియర్(లైంగిక ప్రవర్తన), సెక్సువల్ ఓరియంటేషన్ (లైంగిక అవగాహన) మధ్య ఒక వ్యత్యాసం ఉంది. సాధారణంగా ఒక వ్యక్తికి ఎమోషనల్‌ లేదా లైంగికంగా ఒకరంటే ఇష్టం ఏర్పడితే దానిని సెక్సువల్ బిహేవియర్ అంటారు.

"స్త్రీ లేదా పురుషుల వైపు కలిగే లైంగిక ఆకర్షణను బట్టి తమ సెక్సువల్ ఓరియంటేషన్ ఏంటి అనేదికూడా వారు తెలుసుకోవచ్చు. కానీ ఈ రెండూ సమయం, సందర్భంతోపాటు మారవచ్చు".

"వాస్తవానికి అందరూ వారి వయసులో రకరకాల దశలను దాటేసరికి సెక్సువల్ ఓరియంటేషన్‌ గురించి రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒకరికి కేవలం ఆరేళ్ల వయసులో ఇలా అయితే, ఇంకొకరికి 16 ఏళ్ల వయసులో ఆ అనుభవం తెలుస్తుంది. కొంతమంది అసలు అలా ఎప్పటికీ అనిపించదు" అని ఎషియా తెలిపారు. .

ప్రస్తుత యువతలో తమ ఎల్జీబీటీక్యూ గురించి హైస్కూల్లో చదివేటపుడే తెలుస్తోంది. వారు అంతకు ముందు తరాలతో పోలిస్తే చాలా ముందున్నారు. దానికి కారణం అధిక అవగాహన, వారి సామాజిక ఆమోదం.

Image copyright Getty Images

సెక్సువల్ ఓరియంటేషన్ మారవచ్చు

ఈ విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మిగతా కారణాలతోపాటు జెండర్, సెక్సువాలిటీ సైకలాజికల్ కోణాలు అనేవి ఫిజియాలజీ, సోషియో కల్చరల్ సందర్భాలను చూపిస్తాయి. సంస్కృతి, సమాజంలో మార్పులు వచ్చేకొద్దీ వ్యక్తి జెండర్, సెక్సువాలిటీ మార్పులు చోటుచేసుకుంటాయి. అని క్లింటన్ డబ్ల్యు అండర్సన్ తెలిపారు.

"కచ్చితంగా కొందరిలో ఇలా జరుగుతుంది. వారిలో 9 ఏళ్లు లేదా అంతకు ముందే లైంగిక ఆకర్షణలు ఏర్పడతాయి. కానీ ఆ వయసులో వారికి తమ లైంగిక ప్రవర్తనను బాగా అర్థం చేసుకునే జ్ఞానం, భావోద్వేగ సామర్థ్యం ఉంటుందని అనుకోలేం.

ఎవరైనా ఒక వ్యక్తికి లైంగిక అవగాహన లేదా సెక్సువల్ ఓరియంటేషన్ అనేది ఒక వయసులో తెలియాలనేం లేదు.

ఒక వయసులో వారి లైంగిక ఆకర్షణ వేరేలా ఉండవచ్చు. అది సమయంతోపాటూ మరోలా మారవచ్చు. ఎక్కువ మందికి లైంగిక అవగాహన అనేది యుక్తవయసులోనే ఏర్పడుతుంది.

ఎందుకంటే అది ప్రధానంగా రొమాన్స్, లైంగిక సంబంధాల విషయంలో జరుగుతుంది. రెండోది స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసాలు చిన్నతనంలో కూడా వృద్ధి చెందుతాయి".

Image copyright Getty Images

తల్లిదండ్రులు, సమాజం ప్రభావం

పిల్లల్లో లైంగిక అవగాహన గురించి, అతడిపై సాధారణంగా తన తల్లిదండ్రులు, సమాజం ప్రభావం ఎంత, ఏ మేరకు ఉంటుంది?

పరిశోధనల ఫలితాల ప్రకారం ఎక్కువ మంది ఎల్జీబీటీక్యూ యువకులు తమ చిన్నతనంలో టామ్‌బాయ్‌లాగే ఉన్నారు.

ఇంట్లో నుంచి బయటికొచ్చిన తర్వాత వారు, తమ స్కూల్, ఆఫీసులు, సమాజం నుంచి ద్వేషాలు, భేదాలు, హింస లాంటివి ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉంటుంది. అన్నారు ఎషియా ఎటన్.

"అదృష్టవశాత్తూ, పరిశోధనల్లో మరో విషయం కూడా తెలిసింది. కుటుంబం, స్నేహితులు, స్కూల్లో సాయంగా ఉండేవారితో ఉన్న అనుభవాలు, వారిపై ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా నిరోధకాల్లా పనిచేస్తాయి." అని ఎటన్ చెప్పారు.

"తల్లిదండ్రులు తమ పిల్లలకు వారి స్నేహితులు, బయటి ప్రపంచం గురించి చెబుతూ తమ సెక్సువల్ ఓరియంటేషన్ గుర్తించేలా చేయవచ్చు అలా చేయడం వల్ల తమ పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారు బాటలు వేసినట్టవుతుంది."

Image copyright Getty Images

"చిన్న వయసులోనే లైంగిక అవగాహన ఏర్పడితే దానిని తల్లిదండ్రులు, సమాజం ఆమోదించడం చాలా అవసరం. తల్లిదండ్రులు దానిని అంగీకరించకపోతే పిల్లల్లో చెడు మానసిక ధోరణులు, సంబంధిత పరిణామాలు ఏర్పడుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దానిని అంగీకరిస్తే మాత్రం పిల్లల్లో మెరుగైన పరిణామాలు కనిపిస్తాయి" అని క్లింటన్ చెప్పారు.

"పిల్లల లైంగిక అవగాహనను తల్లిదండ్రులు అంగీకరిస్తే అది వారికి రక్షణలా నిలుస్తుంది. కానీ పిల్లలు మిగతా పిల్లలతో ఉండే స్కూల్, ఆటలు లాంటి వాటిలో దీనిపై సానుకూల లేదా వ్యతిరేక ప్రభావం పడవచ్చు."

"పిల్లలు చదువులో ముందుకు వెళ్లేందుకు, మానసికంగా వారు ఆరోగ్యంగా ఉండేందుకు స్కూల్స్ లాంటి చోట వారికి కాస్త సురక్షిత, అనుకూల వాతావరణం ఉండేలా మనమే జాగ్రత్త పడాల్సి ఉంటుంది" అని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

చెర్నోబిల్: భారీ అణు విషాదానికి నేటితో 33 ఏళ్లు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

మోదీ రోడ్‌షో అంటూ వాజ్‌పేయీ అంతిమయాత్ర వీడియోను షేర్ చేస్తున్నారా?

టీఎస్‌ఆర్టీసీ బస్: ‘‘పక్కా ప్లాన్‌తో ప్రొఫెషనల్స్ చేసిన దొంగతనం ఇది’’.. ఎలా జరిగిందంటే..

మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ ‘ముఖచిత్రం’ షేకుబాయికి భూమి వచ్చిందా

శ్రీలంక దాడుల మృతులు: వంద మరణాలు ఎందుకు తగ్గాయి.. తప్పుగా లెక్కించడానికి కారణాలేంటి

మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ

శ్రీలంక పేలుళ్లు: ఈ ఫొటోలు నిజమేనా

ప్రెస్ రివ్యూ:"కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి"- గవర్నర్‌కు కాంగ్రెస్ డిమాండ్