పిల్లల మీద లైంగిక అకృత్యాలను ప్రేరేపించే వెబ్ సైట్లను హోస్ట్ చేస్తున్న దేశాలేవి?

  • 4 సెప్టెంబర్ 2018
వెబ్ సైట్లు, హోస్టింగ్, పిల్లలు, లైంగిక అకృత్యాలు Image copyright Getty Images

పిల్లల మీద లైంగిక అకృత్యాలను చూపించే వెబ్ సైట్ల గురించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడం చాలా కష్టం.

ఈ పనిలో నిమగ్నమైన సైట్లు తరచుగా 'చట్టబద్ధమైన' ముసుగు వేసుకుని ఉంటాయి. లేదా వాటి నిర్వాహకులు తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు డార్క్ వెబ్‌ను ఉపయోగించుకుంటారు.

ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ (ఐడబ్యూఎఫ్) 2017లో పిల్లలపై అకృత్యాల చిత్రాలను చూపించే 78,589 వెబ్ సైట్లను గుర్తించింది.

వీటిలో 274 వెబ్ సైట్లు బ్రిటన్‌లో హోస్ట్ అవుతున్నాయి. వాటిలోని ప్రతి యూఆర్‌ఎల్‌లో వేలాది చిత్రాలు, వీడియోలు కనిపించాయి.

ఇలాంటి వెబ్‌సైట్లను వెదికేందుకు ఐడబ్యూఎఫ్ వద్ద ఒక ప్రత్యేక బృందం ఉంది. ఇలాంటి సైట్లను సగం వారు గుర్తించగా, మిగతా వాటిని ప్రజలే గుర్తించి సమాచారం ఇచ్చారు.

Image copyright Getty Images

వీటిలో 87 శాతం వెబ్‌సైట్లను ప్రధానంగా ఐదు దేశాలు హోస్ట్ చేస్తున్నాయి. అవి:

  • నెదర్లాండ్స్
  • అమెరికా
  • కెనడా
  • ఫ్రాన్స్
  • రష్యా

ఇలాంటి వెబ్ సైట్లను హోస్ట్ చేసే దేశాలు 65 శాతం యూరప్‌లో ఉన్నాయి. ఈ విషయంలో యూరప్ ఇటీవలే అమెరికాను అధిగమించింది.

అయితే వీటికి సంబంధించిన కంటెంట్‌ను ఎక్కడ రూపొందిస్తున్నారు, వాటిని ఎవరు చూస్తున్నారు అన్నదానిపై మాత్రం సమాచారం లేదు.

అయితే కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన హోస్టింగ్‌ సమాచారం లేనంత మాత్రాన అక్కడ పిల్లలపై అకృత్యాలు జరగడం లేదనో, లేదా దానికి సంబంధించిన కంటెంట్‌ను సృష్టించడం లేదనో లేదా అక్కడ బాధితులు లేరనో అనుకోవడం మాత్రం సరికాదని ఇంటర్నెట్ హాట్ లైన్ సభ్యత్వ సంస్థ ఇన్‌హోప్ తెలిపింది.

2016లో పిల్లలపై లైంగిక అకృత్యాల విషయంలో 45 దేశాలకు చెందిన 85 లక్షల నివేదికలు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

పిల్లలపై లైంగిక అకృత్యాలకు సంబంధించిన ఇన్ని వెబ్ సైట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్‌కు పాకిస్తాన్ విధించిన మరణశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయస్థానం

కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్

హఫీజ్ సయీద్‌‌: ముందస్తు బెయిల్ కోసం వెళ్తుండగా పాకిస్తాన్‌లో అరెస్ట్

రిచా భారతీ: ఖురాన్ పంపిణీ చేయాలన్న కోర్టు.. ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటున్న ఝార్ఖండ్ యువతి

అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...

ఇరాకీ కర్డిస్తాన్‌లోని ఇర్బిల్ నగరంలో కాల్పులు... టర్కీ దౌత్యవేత్త మృతి

డోనల్డ్ ట్రంప్ జాత్యహంకారి అన్న కాంగ్రెస్ మహిళా నేతలు ఎవరు...

అనంతపురం హత్యలు: శివాలయంలో గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా