షిన్‌జాంగ్‌లో లక్షలాది మంది వీగర్ ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు పది లక్షలమంది వీగర్ ముస్లింలను చైనా నిర్బంధించినట్లు వార్తలొస్తున్నాయి. కోటికిపైగా ముస్లింలు ఉండే షిన్‌జాంగ్ ప్రావిన్సులో ఇలా జరుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
ఐఎస్ మిలిటెంట్లు, వేర్పాటువాదుల కారణంగా ఆ ప్రాంతంలో హింస చెలరేగుతోందని ప్రభుత్వ వాదన. నిర్బంధంలో ఉన్నవారు... అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు విశ్వసనీయతను తెలపాలనే ఒత్తిడి పెరుగుతోంది.
వీడియో: లక్షలాది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
వీగర్ ముస్లిం వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన బంధువును కలవడానికి ఓసారి జింజియాంగ్ వెళ్లారు. ‘వాళ్లు రోబోల్లా ఉన్నారు. తమ ఆత్మను కోల్పోయినట్లు కనిపించారు. వాళ్లంతా నాకు బాగా తెలుసు. కానీ గతంలో ఉన్నట్లు వాళ్లిప్పుడు లేరు’ అంటూ నిర్బంధ శిబిరంలో గడిపిన తమ బంధువుల గురించి ఆయన చెప్పారు.
మతపరమైన తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఈ చర్యలు చేపడుతోంది. ముస్లింలలో అవగాహన పెంచేందుకే ప్రభుత్వం ఈ చర్యలని తీసుకుంటోందని కొందరు సాక్షులు చెబుతున్నారు. నిర్బంధ శిబిరాల్లో ఉన్నవారితో అధికార పార్టీ నినాదాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
శిబిరాల్లో వారికి సరైన ఆహారం ఇవ్వరని, హింసిస్తారని వరల్డ్ వీగర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. కానీ అతివాదులపై కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.
జింజియాంగ్ తరచూ హింసకు కేంద్రంగా మారుతోంది. దానికి తగ్గట్లే అణచివేత చర్యలు అమలవుతున్నాయి. ఈ నిర్బంధ శిబిరాల విధానాన్ని ఆపేయాలని ఐరాస చైనాను కోరుతోంది.
ఇవి కూడా చదవండి
- ఇంతకీ ఈ వీగర్ ముస్లింలు ఎవరు? వారి ఆందోళన ఏంటి?
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- పిల్లల మీద లైంగిక అకృత్యాలను ప్రేరేపించే వెబ్ సైట్లను హోస్ట్ చేస్తున్న దేశాలేవి?
- శ్రీలంక సైన్యంలో కొత్త జవాన్లు... బాంబులను పసిగట్టే జీవులు
- కేరళ: వరద బాధితులకు ర్యాట్ ఫీవర్ గండం
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- 'మంచి ముస్లిం' అనేది ఎవరు నిర్ణయిస్తారు?
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- భారతదేశంలో ముస్లింల సమస్యల గురించి మనకు అవగాహన ఉందా?
- అద్భుతంగా వెలిగిపోతున్న చైనా నగరాలు
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- అమెరికా కొత్త సుంకాలు చైనాను ఎంతగా దెబ్బ తీస్తాయి?
- సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)