టైఫూన్ జేబి: జపాన్ అతలాకుతలం... జలమయమైన కాన్సాయి ఎయిర్‌పోర్ట్
జపాన్ అతలాకుతలం
టైఫూన్ జేబి ధాటికి జపాన్ అతలాకుతలమైంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేనంతగా జేబి ప్రభావం చూపిందని, ఇప్పటివరకు 10 మంది మృతిచెందారని, 300 మంది గాయపడ్డారని జపాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి యొషిహిదె సూగా తెలిపారు.
అక్కడి ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయమాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అక్కడ చిక్కుకున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జపాన్ పశ్చిమ ప్రాంతంలో నష్టం తీవ్రంగా ఉంది. క్యోటో, ఒసాకా సహా పలు నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.
విమాన సర్వీసులు, రైళ్లు, ఫెర్రీలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫొటో సోర్స్, Kyodoma Reuters
తుపాను ధాటికి విరుచుకుపడుతున్న భారీ అలలు
గాలుల వేగం తగ్గి ఉత్తర దిశగా పవనాలు కదులుతుండడంతో వరదలు, మట్టి పెళ్లలు విరిగిపడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.
ఫొటో సోర్స్, AFP
ఒసాకా వీధుల్లో హోర్డింగులు, కేబుళ్లు కుప్పకూలాయి
బుధవారం ఉదయం నాటికి 12 లక్షల మంది ప్రజలను వారున్న ప్రాంతాలు ఖాళీ చేయాల్సిందిగా అధికారులు సూచించారు.
ముఖ్యంగా, 30 వేల మంది తీవ్ర ప్రమాదంలో ఉన్నారని, అయితే తప్పనిసరిగా తరలివెళ్లాలన్న ఆదేశాలేమీ ఇవ్వలేదని అక్కడి అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఒసాకాలో గాలుల తీవ్రతకు జెయింట్ వీల్ గిర్రున తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టైఫూన్ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కార్యాలయాలు, సంస్థలను మూసివేశారు. సుమారు 20 లక్షల కుటుంబాలు ఈ ప్రభావానికి గురయ్యాయి.
ఫొటో సోర్స్, AFP
నీట మునిగిన కాన్సాయ్ విమానాశ్రయ రన్‌వే
అంతర్జాతీయ సర్వీసులు సహా మొత్తం 800 విమానాలు రద్దయ్యాయి.
బుధవారం ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయినవారిని సమీపంలోని మరో స్థానిక విమానాశ్రాయానికి బోట్లలో తరలించారు.
ఫొటో సోర్స్, EPA
విమానాశ్రయానికి దారి తీసే వంతెనను ఢీకొన్న ట్యాంకర్
కృత్రిమంగా నిర్మించిన దీవిలో ఉన్న కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భూభాగంతో కలిపే వంతెనను ఓ ట్యాంకర్ ఢీకొట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సుమారు 3 వేల మంది విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వారిని బోట్లలో సమీపంలోని మరో విమానాశ్రయానికి సురక్షితంగా తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- తదుపరి ‘యాపిల్’ ఏది? భవిష్యత్తు నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు ఎక్కడుంది?
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- ఆస్ట్రేలియా: పెట్రోలు అయిపోతోందా? అయిపోతే బండి నడిచేదెలా?
- ప్లాస్టిక్‌పై నిషేధం: ఆస్ట్రేలియాలో ఆగ్రహం
- పీవీ సింధు: ఆదాయంలో క్రికెట్ స్టార్లను వెనక్కు నెట్టిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి
- ఆసియా క్రీడలు: దీక్షా డాగర్.. అద్భుతమైన షాట్స్ కొట్టినా అభిమానుల చప్పట్లేమీ ఆమెకు వినపడవు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)