మార్కెట్లో అమ్మే పెరుగు మంచిదేనా?

  • జేమ్స్ గళఘర్
  • బీబీసీ ప్రతినిధి
curd

ఫొటో సోర్స్, Getty Images

ప్రోబయాటిక్స్ పేరుతో ప్యాక్ చేసి అమ్మే మంచి బాక్టీరియా ఆహార పదార్థాలు దాదాపు ఎందుకూ పనికిరావని ఇజ్రాయెల్‌కు చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

మనం ప్రోబయాటిక్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందనేదానిపై వారు చాలా వివరంగా ఒక పరిశోధన చేశారు.

మార్కెట్లో ప్రోబయాటిక్స్‌పై అవి తీసుకోవడం వల్ల పొట్టకు మంచిదని, ఆరోగ్యకరమని అని ఉంది. కానీ అధ్యయనం ఫలితాల్లో మాత్రం వాటి ప్రభావం శరీరం లోపల తక్కువగా లేదంటే అసలు లేదని తెలిసింది.

భవిష్యత్తులో ప్రతి వ్యక్తికీ అనుగుణంగా, వారి అవసరాలు తీర్చడానికి ప్రోబయాటిక్స్ అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా లభించే లాక్టోబసిల్లస్, బైఫిడోబాక్టీరియా లాంటి 11 మంచి బాక్టీరియాలతో వీజ్‌మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ పరిశోధకుల బృందం సొంతంగా ఒక ప్రోబయాటిక్ మిశ్రమాన్ని తయారుచేసింది.

దానిని ఆరోగ్యంగా ఉన్న 25 మంది వలంటీర్లకు ఒక నెలపాటు ఇచ్చారు. తర్వాత వారి నుంచి సర్జరీ ద్వారా పొట్టలోని వివిధ భాగాలు, చిన్న, పెద్ద పేగుల దగ్గర శాంపిల్స్ సేకరించారు.

బాక్టీరియా ఎక్కడ విజయవంతంగా పెరిగింది, పేగుల్లో అది ఎలాంటి మార్పులకు కారణమైంది అనేవి పరిశోధకులు గమనించారు.

ఆ పరిశోధనలో పాల్గొన్న వలంటీర్లు సగం మందిలో మంచి బాక్టీరియా నేరుగా నోట్లోంచి వెళ్లి ఇంకో మార్గం నుంచి బయటికొచ్చినట్టు సెల్‌ జర్నల్‌ చెప్పింది.

మిగతా వారిలో పొట్టలో సూక్ష్మజీవుల రద్దీ నుంచి బయటపడే ముందు ప్రోబయాటిక్స్ అక్కడ కాసేపు మాత్రమే ఉండగలిగాయి.

పులిసే పెరుగు, ఊరగాయలు, పచ్చళ్లు, చీజ్, పుల్లటి పిండితో చేసే రొట్టెలు, చాక్లెట్లు లాంటివి కూడా ప్రోబయాటిక్స్ కిందికి వస్తాయని చెబుతారు.

మనం మనిషి కాదు- సూక్ష్మ జీవుల సమూహం

  • మనం మనిషి కాదు, సూక్ష్మజీవుల సమూహం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • మన శరీరంలో ఉన్న కణాలన్నీ లెక్కపెడితే, మనిషి కేవలం 43 శాతం మాత్రమే ఉంటాడు.
  • మిగతా శరీరం అంతటా బాక్టీరియా, వైరస్‌లు, ఫంగై, ఆర్కీ అనే ఏక కణ జీవులు ఉంటాయి
  • మానవ జన్యుపటం (జీనోమ్)-మానవుడి పూర్తిస్థాయి జన్యుక్రమం- 20,000 జన్యువులతో తయారైంది.
  • కానీ.. మన శరీరంలోని సూక్ష్మజీవాల జన్యువులన్నిటినీ కలిపితే.. 20 లక్షల నుంచి రెండు కోట్ల వరకు ఉంటాయి.
  • ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు.. డిప్రెషన్, ఆటిజం వంటి లోపాలకు, క్యాన్సర్ మందులు పనిచేయడానికి, మన శరీరంలోని సూక్ష్మజీవాలకు సంబంధం ఉంటుంది.

ప్రతి రోగికీ అనుగుణంగా ప్రోబయాటిక్స్

లైనింగ్ అనే పది లక్షల కోట్ల బ్యాక్టీరియా మన పొట్టలో ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో రకం మిశ్రమంలా సూక్ష్మజీవులు ఉంటాయి.

"రెడీమేడ్ ప్రోబయాటిక్స్ ప్రతి ఒక్కరికీ పనిచేస్తాయని ఊహించడం పొరపాటే అవుతుంది" అని డాక్టర్ ఎరన్ ఎలినావ్ తెలిపారు.

"భవిష్యత్‌లో ప్రోబయాటిక్స్‌ను ప్రతి రోగి అవసరాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుంది"

"అంటే తమకు సరిపడతాయో, లేదో చూడకుండా, సూపర్ మార్కెట్ వెళ్లి ప్రోబయాటిక్స్ కొనుక్కుని వాడడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు" అని ఆయన బీబీసీకి చెప్పారు.

యాంటీ బయాటిక్స్ కోర్సు ఉపయోగించాక ప్రోబయాటిక్స్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. అందులో మంచి, చెడు బ్యాక్టీరియాలు రెండూ తుడిచిపెట్టుకుపోయాయి.

శాస్త్రవేత్తలు 46 మందిపై ఈ పరిశోధనలు చేశారు. ప్రోబయాటిక్స్ వల్ల ఆరోగ్యకరమైన సాధారణ బాక్టీరియా తనంతట తాను పెరగడం ఆలస్యం అయ్యిందని సెల్ జర్నల్‌లో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

"ప్రోబయాటిక్స్ హానిరహితం, అందరికీ ప్రయోజనం అని ప్రస్తుతం చెబుతున్నదానికి విరుద్ధంగా.. ప్రోబయాటిక్స్, యాంటీబయాటిక్స్‌తో కలిపి ఉపయోగించం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని, దీర్ఘకాల దుష్పరిణామాలు కలగవచ్చని ఈ ఫలితాలు బయపెట్టాయి" అని డాక్టర్ ఎలినవ్ చెబుతున్నారు.

సూక్ష్మజీవులకు, మన శరీరంలోని భాగాలకు ఉన్న ఆ అంతుపట్టని బంధం చిక్కుముడిని సైన్స్ పూర్తిగా విప్పుతుందని ఎన్నో ఆశలున్నాయి. అదే జరిగితే ఆ ఫలితం ఎన్నో కొత్త చికిత్సలకు దారితీస్తుంది.

అయితే, "ఈ పరిశోధనలో ఫలితాలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని" సంగెర్ ఇన్‌స్టిట్యూట్‌ సూక్ష్మజీవుల పరిశోధకుడు డాక్టర్ ట్రెవోర్ లాలీ అంటున్నారు.

"ప్రోబయాటిక్స్ ఎంతో కాలం నుంచి మన చుట్టుపక్కలే ఉంటున్నాయి. మరింత పరిశీలన చేసిన తర్వాతే అవి వస్తున్నాయి. ఏవీ పెరగకుండా ఉండడానికి పొట్టలో ఒక సహజ క్రియ ఉంది. అది సాధారణంగా వ్యాధికారకాలను అడ్డుకుంటుంది. అలాంటి దాన్నుంచి మనం ప్రయోజనం పొందాల్సి ఉంటుంది అని లాలీ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)